Covid Vaccine: నేటి నుంచి తెలంగాణలో రెండో డోసు వ్యాక్సిన్ పంపిణీ
Covid Vaccine: తెలంగాణలో నేటి నుంచి రెండో డోసు కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం పునః ప్రారంభం కానుంది.
Covid Vaccine: తెలంగాణలో నేటి నుంచి రెండో డోసు కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం పునః ప్రారంభం కానుంది. గత పదిరోజులుగా రాష్ట్రంలో వ్యాక్సినేషన్ పంపిణి నిలిచిపోయిన సంగతి తెలిసిందే. మొదటి డోసు వేయించుకుని రెండో డోసు కోసం అర్హత కలిగిన వాళ్లు దగ్గరలోని ప్రభుత్వ వ్యాక్సి నేషన్ కేంద్రానికి వెళ్లి తీసుకోవాలని సూచించారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ సోమవారం సాయంత్రం ఆదేశాలు జారీ చేశారు.
సీఎం కేసీఆర్ సోమ వారం రాష్ట్రంలో కరోనా కట్టడి, బ్లాక్ ఫంగస్ పరి స్థితి, వ్యాక్సినేషన్, లాక్‌డౌన్ అమలుపై ప్రగతి భవన్‌లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో ఇప్పటికే తొలిడోసు కొవిడ్ వ్యాక్సిన్ వేయించుకుని రెండో డోసు కోసం అర్హత కలిగిన వాళ్లు దగ్గరలోని ప్రభుత్వ వ్యాక్సి నేషన్ కేంద్రానికి వెళ్లి తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో కరోనా పరీక్షల కోసం వస్తున్న ఏ ఒక్కరినీ వెనక్కి తిప్పి పంపరాదని, ప్రతి ఒక్కరికీ పరీక్షలు చేయాలని స్పష్టం చేశారు. ఈ మేరకు పీహెచ్‌సీలు, పరీక్షా కేంద్రాలకు సరఫరా చేస్తున్న కిట్ల సంఖ్యను పెంచాలని ఆదేశించారు.
మరోవైపు కరోనా వ్యాప్తి పెరగడానికి కారణమైన సూపర్ స్ప్రెడర్లను గుర్తించాలని ఆయన సూచించారు. సూపర్ స్ప్రెడర్లను ప్రత్యేకంగా వ్యాక్సి నేషన్ కార్యక్రమాన్ని నిర్వహించాలని మంత్రి హరీశ్ రావు, వైద్యారోగ్య శాఖ అధికారులను ఆదేశిం చారు. దీనికి సంబంధించి తగిన విధి విధానాలను రూపొందించాలని సీఎం సూచించారు.