Telangana Vaccination: తెలంగాణలో నేడు, రేపు వ్యాక్సినేషన్‌ నిలిపివేత

Telangana Vaccination: నేడు,రేపు రాష్ట్రంలో వ్యాక్సినేషన్‌ డ్రైన్‌ను నిపివేసినట్లు డీహెచ్‌ శ్రీనివాసరావు పేర్కొన్నారు.

Update: 2021-05-15 01:45 GMT

Telangana Vaccination:(File Image) 

Telangana Vaccination: తెలంగాణ సర్కార్ రాష్ట్ర వ్యాప్తంగా నేడు, రేపు కరోనా వ్యాక్సినేషన్ నిలిపివేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. కొవిషీల్డ్‌ టీకా మొదటి డోసు తీసుకున్న వారికి రెండో డోసు 12 నుంచి 16 వారాల వ్యవధిలో ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యేక డ్రైవ్‌ని రద్దు చేసింది. ఈనెల 17న తిరిగి ప్రారంభించనున్నట్లు తెలిపింది. కొవిసీల్డ్‌ టీకా తీసుకున్న వారికి మొదటి డోస్‌ తర్వాత 12 వారాలు దాటిన తర్వాతే రెండో డోస్‌ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. కాగా, ఇప్పటి వరకు కొవిషీల్డ్‌ టీకా రెండో డోస్‌ను 6-8 వారాల తర్వాత ఇచ్చారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలతో శని, ఆదివారాలు రాష్ట్రంలో వ్యాక్సినేషన్‌ డ్రైన్‌ను నిలిపివేస్తున్నట్లు డీహెచ్‌ శ్రీనివాసరావు పేర్కొన్నారు.

కాగా, కరోనా కట్టడికి తెలగాణ రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్‌ జోరుగా కొనసాగుతోంది. ఒక వైపు వ్యాక్సినేషన్‌ కొనసాగుతుంటే మరోవైపు పాజిటివ్‌ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. ఇక రాష్ట్రంలో లాక్‌డౌన్‌ కూడా కొనసాగుతోంది. పాజిటివ్‌ కేసుల కట్టడికి ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతోంది.

Tags:    

Similar News