Coronavirus updates in Telangana: తెలంగాణలో కొత్తగా 1,764 కరోనా పాజిటివ్ కేసులు
Coronavirus updates in Telangana: తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది. నిన్న రాత్రి 8 గంటల వరకు కొత్తగా 1,764 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. 12 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 58,906కి చేరింది. మృతుల సంఖ్య 492కి పెరిగింది. కరోనా నుంచి కోలుకోని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 43,751కి చేరింది. ప్రస్తుతం 14,663 మంది చికిత్స పొందుతున్నారు. నిన్న ఒక్కరోజే 18,858మంది నమూనాలను పరీక్షించగా, 1,764 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. రాష్ర్టంలో ఇప్పటి వరకు 3,97,939 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.
జీహెచ్‌ఎంసీలో అత్యధికంగా మరో 509 కేసలు నమోదు కాగా మేడ్చల్‌లో 158, రంగారెడ్డిలో 147, వరంగల్ అర్బన్‌లో 138, కరీంనగర్‌లో 93, సంగారెడ్డిలో 89, ఖమ్మంలో 69, నల్గొండలో 51, నిజామాబాద్‌లో 47 కేసులు నమోదు అయ్యాయి. మహబూబ్‌నగర్‌లో 47, పెద్దపల్లిలో 44, వరంగల్ గ్రామీణంలో 41, సూర్యపేటలో 38,భద్రాది కొత్తగూడెంలో 30, నాగర్‌కర్నూలులో 29, మంచిర్యాలలో 28 కేసులు నమోదు అయ్యాయని వివరించారు. ప్రస్తుతం తెలంగాణలో జనరల్ బెడ్లు 11928 ఉండగా నిండినవి 647 ఉన్నాయి. అలాగే ఆక్సిజన్ బెడ్లు 3537 ఉండగా నిండినవి 1304 ఉన్నాయి. ICU బెడ్లు 1616 ఖాళీగా ఉండగా 265 నిండి ఉన్నాయి.