Coronavirus Updates in Telangana: తెలంగాణలో కొత్తగా 2,795 పాజిటివ్ కేసులు..

Coronavirus updates in Telangana: తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది.

Update: 2020-08-27 03:48 GMT

Coronavirus updates in Telangana: తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది. నిన్న రాత్రి 8 గంటల వరకు కొత్తగా 2795 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. 08 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,14,483కి చేరింది. మృతుల సంఖ్య 796కి పెరిగింది. మరోవైపు నిన్న 872 మంది కోలుకోగా.. ఇప్పటి వరకూ డిశ్చార్జి అయిన వారి సంఖ్య 86,095కి చేరింది.

ప్రస్తుతం 27,600 మంది చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో 19,113 మంది ఉన్నట్టు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. తెలంగాణలో కరోనా మరణాల రేటు 0.68 ఉందని వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కోలుకున్న వారి రేటు 75.2కు చేరుకుంది. గత 24 గంటల్లో 30, 772 కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేశామని వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. జీహెచ్ఎంసీలో - 449, కరీంనగర్- 136, ఖమ్మం 152, మహబూబాబాద్- 102 మంచిర్యాల- 106, మేడ్చెల్- 113, నల్గొండ- 164, నిజామాబాద్- 112, రంగారెడ్డి- 268, సిద్దిపేట- 113 వరంగల్ అర్బన్- 131 కేసులు నమోదు ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్ 20 866 ఉన్నట్లు వైద్యశాఖ వెల్లడించింది.. 


Tags:    

Similar News