Coronavirus Updates in Telangana: తెలంగాణాలో కొత్తగా 2,012 పాజిటివ్ కేసులు..

Coronavirus updates in Telangana: తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది.

Update: 2020-08-05 04:01 GMT
Representational Image

Coronavirus updates in Telangana: తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది. నిన్న(మంగళవారం) రాత్రి 8 గంటల వరకు కొత్తగా 2,012 పాజిటివ్‌కేసులునమోదైనట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. 13 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 70,958కి చేరింది. మృతుల సంఖ్య 576కి పెరిగింది

.మంగళవారం ఒక్క రోజే 1,139 అయ్యారు. దీంతో కరోనా వైరస్ నుంచి కోలుకోని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 50,814కి చేరింది. ప్రస్తుతం 19,568 మంది చికిత్స పొందుతున్నారు. నిన్న ఒక్కరోజే 21,118 మంది నమూనాలను పరీక్షించగా 2,012 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. రాష్ర్టంలో ఇప్ప‌టి వ‌ర‌కు 5,22,143కి మందికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. మరో 1167 మందికి సంబంధించిన పరీక్షల ఫలితాలు రావాల్సి ఉంది. 

రాష్ట్రంలో రికవరీల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 320 కేంద్రాల్లో ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలు చేస్తున్నట్లు.. ప్రస్తుతం తెలంగాణలో మరణాల రేటు 0.81 శాతంగా ప్రభుత్వం చెప్పింది. దేశంలో అది 2.11 శాతంగా ఉందని తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ తెలిపింది.



 


Tags:    

Similar News