తెలంగాణలో కొత్తగా 1,896 పాజిటివ్ కేసులు..

Coronavirus updates in Telangana: తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది.

Update: 2020-08-11 03:32 GMT

Coronavirus updates in Telangana: తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది. నిన్న(సోమవారం) రాత్రి 8 గంటల వరకు కొత్తగా 1,896 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. 08 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 82,647కి చేరింది. మృతుల సంఖ్య 645కి పెరిగింది. సోమవారం ఒక్క రోజే 1,788 మంది హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కరోనా వైరస్ నుంచి కోలుకోని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 59,374కి చేరింది. ప్రస్తుతం 22,628 మంది చికిత్స పొందుతున్నారు. నిన్న ఒక్కరోజే 18,035 మంది నమూనాలను పరీక్షించగా, 1,896 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. దీంతో ఇప్పటి వరకు తెలంగాణలో నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య 6,42,875కి చేరింది.

కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 338, రంగారెడీ-147, వరంగల్ రూరల్ 35, వరంగల్ అర్బన్ 95, వికారాబాద్ 21, కరీంనగర్‌ 121, జోగులాంబ గద్వాల జిల్లా 85, సంగారెడ్డి-49, పెదపల్లి 66, భద్రాద్రి కొత్తగూడెం 60, కామారెడ్డి 71, సిరిసిల్ల 38, ఖమ్మం 65, నిజామాబాద్-42, సిద్దిపేట 64, నల్గొండ 54, జగిత్యాల 59, జనగామ 71, మహబూబ్ నగర్ 58, మంచేర్యాల 11, భుపల్లపల్లి 20, ఆదిలాబాద్ 12 కేసులు నమోదుఅయ్యాయి. రాష్ట్రంలో రికవరీల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది ప్రస్తుతం రికవరీ రేట్ 71.3గా ఉంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 320 కేంద్రాల్లో ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలు చేస్తున్నట్లు.. ప్రస్తుతం తెలంగాణలో మరణాల రేటు 0.81 శాతంగా ప్రభుత్వం చెప్పింది. దేశంలో అది 2.11 శాతంగా ఉందని తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ తెలిపింది.




  


Tags:    

Similar News