Coronavirus Updates in Telangana: తెలంగాణ కరోనా హెల్త్ బులిటెన్ విడుదల..ఈ రోజు ఎన్ని కేసులంటే...
Coronavirus Updates in Telangana: తెలంగాణలో గత కొద్దీ రోజులుగా కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. నిన్న( మంగళవారం) అత్యధికంగా 1,524 కేసులు నమోదు కాగా ఇవ్వాళ కొత్తగా 1597 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
Coronavirus Updates in Telangana: తెలంగాణలో గత కొద్దీ రోజులుగా కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. నిన్న( మంగళవారం) అత్యధికంగా 1,524 కేసులు నమోదు కాగా ఇవ్వాళ కొత్తగా 1597 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కాగా ఈ రోజు నమోదయిన కేసుల్లో జీహెచ్ఎంసీ 796, రంగారెడ్డి-212, మేడ్చెల్-115, సంగారెడ్డి-73, వరంగల్ అర్బన్-44, కామారెడ్డి-30, కరీంనగర్-41, నల్గొండ-58, సిద్దిపేట-27, మంచిర్యాల-26, పెద్దపల్లి-20 నమోదయ్యాయి.
గడిచిన 24 గంటల్లో 11 మంది కరోనాతో మృతి చెందగా ఇప్పటి వరకు కరోనాతో పోరాడి రాష్ట్రంలో 386 మంది మరణించారు. దినికి సంబంధించిన హెల్త్ బులిటెన్ ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య మొత్తం 39, 342 కేసులకు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఆక్టీవ్ కేసులు 12958 ఉన్నట్లు వైద్యశాఖ వెల్లడి చేసింది. ఇక అటు కరోనాతో పోరాడి ఇప్పటివరకు 25,999మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇవ్వాల ఒక్క రోజే 1,159 మంది డిశ్చార్జ్ అయ్యారు.