Coronavirus updates in Telangana: తెలంగాణలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన శనివారం నాటి కరోనా బులెటిన్ తాజాగా విడుదలైంది. రాష్ట్రంలో నిన్న రాత్రి 8 గంటల వరకు కొత్తగా 1,593 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. 8 మంది చనిపోయారు. తెలంగాణలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 54,059కి చేరగా, ఇప్పటి వరకు కరోనాతో 463 మంది మృతి చెందారు. కరోనా నుంచి కోలుకుని 41,332 మంది డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలోని పలు ఆస్పత్రుల్లో 12,264 మంది చికిత్స పొందుతున్నారు.
బులెటిన్‌లో రాష్ట్రంలో అందుబాటులో ఉన్న హాస్పిటల్స్, బెడ్ల సంఖ్య, ఐసీయూలో ఎంతమంది ఉన్నారు, వెంటిలేటర్లు ఎన్ని ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏ హాస్పిటల్‌లో ఏం జరుగుతుందన్న పూర్తి వివరాలను ఇచ్చారు. బులెటిన్‌లో సమగ్ర వివరాలను అందజేసేందుకు ప్రయత్నించారు. ర్యాపిడ్ టెస్టులు జరుగుతున్న హాస్పిటల్స్ వివరాలు జిల్లాల వారీగా ఉన్నాయి.
Media Bulletin on status of positive cases #COVID19 in Telangana. (Dated. 26.07.2020)#TelanganaFightsCorona #StayHome #StaySafe pic.twitter.com/hvpRp9GcJC
— Eatala Rajender (@Eatala_Rajender) July 26, 2020