Coronavirus updates in Telangana: తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది. నిన్న(ఆదివారం) రాత్రి 8 గంటల వరకు కొత్తగా 1,256 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. 10 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 80,751కి చేరింది. మృతుల సంఖ్య 637కి పెరిగింది.
నిన్న ఒక్క రోజే 1,587 మంది హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కరోనా వైరస్ నుంచి కోలుకోని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 57,586కి చేరింది. ప్రస్తుతం 22,528 మంది చికిత్స పొందుతున్నారు. కాగా ఆదివారం 11,609 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. ఇప్పటివరకు రాష్ట్రంలో 6,24,840 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. తెలంగాణలో రికవరీ రేటు 71.31 శాతంగా ఉంది. కాగా జాతీయస్థాయిలో రికవరీ రేటు 68.78శాతం ఉంది.