Coronavirus Rapid Test kit Hyderabad: ర్యాపిడ్‌ టెస్టులకు ఓకే.. రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

Coronavirus Rapid Test Hyderabad: కంటికి కనిపించని కరోనా వైరస్ చాపకింద నీరులా రాష్ట్ర మంతటా విస్తరిస్తుంది.

Update: 2020-07-03 04:45 GMT

Coronavirus Rapid Test Hyderabad: కంటికి కనిపించని కరోనా వైరస్ చాపకింద నీరులా రాష్ట్ర మంతటా విస్తరిస్తుంది. దీంతో కరోనా బాధితుల సంఖ్య రోజు రోజుకు రెట్టింపు అవుతున్నాయి. ఏ విధంగా అయితే కేసులు పెరిగిపోతున్నాయో అదే విధంగా టెస్టులను కూడా వేగంగా నిర్వహించేందుకు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) అనుమతి పొందిన ర్యాపిడ్‌ యాంటీజెన్‌ డిటెక్షన్‌ టెస్ట్‌అను అమలు చేయనుంది. ఈ టెస్టుల ద్వారా గరిష్టంగా అర గంటలో ఫలితం తెలుస్తుంది. అదే విధంగా ఎవరైనా కరోనా అనుమానితులు టెస్టులు చేయించుకుంటే వారికి కేవలం 15 నిమిషాల్లోనే వైరస్‌ ఉందో లేదో నిర్ధారించే యాంటీజెన్‌ పరీక్షను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. వైరస్‌ తీవ్రత ఉన్న ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మొదలు వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ కిట్లను వినియోగించనున్నారు. దీనికి సంబంధించి రెండు, మూడు రోజుల్లో ఢిల్లీ నుంచి కిట్లు రాష్ట్రానికి రానున్నాయి. అవి రాష్ట్రానికి రాగానే వాటిని ఉపయోగించి వైద్య సిబ్బంది విరివిగా పరీక్షలు చేయనున్నారు. అంతే కాదు ఆ వైద్య పరీక్షల ఫలితాలను కూడా అప్పటికప్పుడే ప్రకటిస్తారు.

ముందుగా రాష్ట్రానికి 50 వేల కిట్లు తెప్పించి పరీక్షలు నిర్వహిస్తారు. ఆ తర్వాత ప్రైవేటు లేబొరేటరీలకు కూడా యాంటీజెన్‌ టెస్టులకు అనుమతి ఇస్తారు. ఈ కిట్ల ద్వారా నమూనాలు సేకరించిన గంటలో పరీక్ష చేయాల్సి ఉంటుంది. ఇక రాష్ట్రంలో కరోనా వైరస్‌ నమూనాలు సామర్థ్యానికి మించి వస్తుండటంతో ప్రభుత్వ, ప్రైవేటు లేబొరేటరీలపై తీవ్ర భారం పడుతోంది. ఈ కిట్లను ప్రవేశపెడితే వాటి ద్వారా పరీక్షించిన తరువాత పాజిటివ్‌ వచ్చిన వారిని తక్షణమే హోం ఐసోలేషన్‌ లేదా అవసరాన్ని బట్టి ఆసుపత్రికి తరలిస్తారు. ప్రస్తుతం ఆర్‌టీ–పీసీఆర్‌ పరీక్షకు ప్రైవేటు లేబొరేటరీల్లో రూ. 2,200 వరకు ఖర్చవుతుంది. కానీ యాంటీజెన్‌ పరీక్షకు మాత్రం రూ. 500 మాత్రమే ఖర్చు కానుంది.

ప్రస్తుతం నిర్వహిస్తున్న ఆర్‌టీ–పీసీఆర్‌ పరీక్ష చేయడానికి, అదే విధంగా ఎక్కువ శాంపిళ్లు పేరుకుపోవడం, శాంపిళ్ల సేకరణ అనంతరం వాటిని లేబొరేటరీకి తరలించడం వల్ల సమయం వృథా అవుతోంది. దీంతో పరీక్షల కొంత మంది నాయకులు ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో కరోనా నిర్ధారణ కోసం ఆర్‌టీ–పీసీఆర్, ట్రూనాట్, సీబీనాట్‌లను ఉపయోగిస్తున్నారు. నమూనాల సేకరణ, తదనంతరం వాటి రవాణాకు ఆయా ప్రాంతాలను బట్టి కనీసం రెండు నుంచి ఐదు గంటల వరకు పడుతుంది. 

Tags:    

Similar News