Coronavirus Pandemic Telangana: ఇలా చేస్తే కేసులు తప్పవు.. తెలంగాణా ప్రభుత్వం హెచ్చరిక
Coronavirus Pandemic Telangana: కరోనా... ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా దీన్ని ఎలా ఎదుర్కొవాలనే దానిపై మల్లగుల్లాలు.
Coronavirus Pandemic Telangana: కరోనా... ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా దీన్ని ఎలా ఎదుర్కొవాలనే దానిపై మల్లగుల్లాలు. దీని వ్యాప్తి వల్ల లక్షల్లో కేసులు నమోదు. అయితే అన్నిచోట్ల దానికి అనుగుణంగా లేని సదుపాయాలు... దీనికి ఒక్కటే మార్గం... కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడమే. అయితే దానికి అనుగుణంగా జనాలు సైతం ఉంటున్నారా? అంటే లేదనే చెప్పాలి... ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏదో పని పెట్టుకుని రోడ్ల వెంబడి తిరుగుతుండటమే. స్వచ్ఛందంగా ఇంట్లో ఉండాలని సూచిస్తున్నా చెవి కెక్కడం లేదు. దీంతో పాటు మరికొందరు విందులు, వినోదాలు. .. ఇలాంటి వాటి వల్ల ఒక్కరికో.. ఇద్దరికో వైరస్ సోకడం లేదు... ఏకంగా పదుల సంఖ్యలో ప్రజలకు వైరస్ అంటుకుంటోంది...దీనిపై అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరికలు చేస్తున్నా పట్టించుకున్న నాధుడే లేదంటే నమ్మరు. అందుకే ఇలాంటి వాటిని నిరోధించేందుకు ప్రభుత్వం కొత్త ఏర్పాట్లు చేసింది. అనుమతి లేకుండా ఇలాంటి విందులు, వినోదాలు చేస్తే కటకటాల వెనక్కు వెళ్లాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు పోలీసులు.
లాక్‌డౌన్ నిబంధనలు సడలించాక కరోనా కేసులు పెరుగుతున్నాయి. ప్రభుత్వాలు ఎన్నివిధాలుగా అవగాహన కల్పిస్తున్నా కొందరు నిబంధనలను పెడచెవిన పెడుతున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో ఓ మంత్రి బంధువు హోటల్లో రేవ్‌పార్టీ, మరో వ్యాపారి పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడంపై పోలీసులు కన్నెర్ర జేశారు. ఇకపై రాష్ట్రంలో అనుమతి లేకుండా పార్టీలు, విందులు నిర్వహిస్తే నిర్వాహకులపై క్రిమినల్ కేసులు పెడతామని పోలీస్ అధికారులు హెచ్చరిస్తున్నారు.
రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు ఇప్పటికే 26 వేలకు చేరువైన నేపథ్యంలో పార్టీలు, విందుల అనుమతులను కఠినతరం చేయనున్నారు. ముందస్తు అనుమతి లేకుండా చేపట్టే ఇలాంటి వేడుకలను ఉపేక్షించబోమని పోలీసులు స్పష్టంచేస్తున్నారు. ఇప్పటికే పోలీస్‌స్టేషన్లలోకి వచ్చే ఫిర్యాదుదారులు మాస్కులేకుండా వచ్చినా గుంపులుగా ప్రవేశించినా ఎపిడమిక్ యాక్ట్ 51(బి) ప్రకారం కేసుల నమోదు, రూ.వెయ్యి జరిమానా విధిస్తున్న సంగతి తెలిసిందే.