Corona Victim Delivers in Ambulance: అంబులెన్స్‌లో కరోనా బాధితురాలి డెలివరీ
Corona Victim Delivers in Ambulance: కరోనా బారిన పడిన నిండు గర్భిణిని వైద్యం నిమిత్తం 108 వాహనంలో హైదరాబాద్ ఆస్పత్రికి తరలిస్తుండగా ఆమె మార్గమద్యంలోనే పురుడు పోసుకుంది. ఈ ఘటనకు సంబంధించి 108 సిబ్బంది తెలిపిన పూర్తివివరాల్లోకెళితే కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌కు చెందిన ఓ మహిళ 9 నెలల నిండు గర్భిణి. కాగా ఆమెకు కరోనా లక్షణాలు ఉండడంతో పరీక్షలు చేయించగా పాటివివ్ అని నిర్ధారణ అయ్యింది. దీంతో వైద్యులు ఆ మహిళ డెలివరీ కోసం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉండగా ఆమెను హైదరాబాద్‌కు తరలించేందుకు నుంగనూరుకు చెందిన 108 సిబ్బంది ప్రయత్నించారు. అంబులెన్స్ లో తరలిస్తున్న క్రమంలోనే మహిళకు మార్గం మధ్యంలో పురిటి నొప్పులు మొదలయ్యాయి.
సరిగ్గా మేడ్చల్ జిల్లా శామీర్‌పేట వద్దకు చేరుకునే సరికి ఆమెకు పురిటి నొప్పులు ఎక్కువ అయ్యాయి. దీంతో 108 సిబ్బంది వాహనంలోనే ఆమెకు డెలివరీ చేయగా ఆమె పండంటి పాపకు జన్మనిచ్చింది. ఆ తరువాత నవజాత శిశువును, తల్లిని అదే వాహనంలో హైదరాబాద్ తరలించారు. ప్రస్తుతం తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉన్నారని సిబ్బంది తెలిపారు.
ఇక ఇప్పటికే గాంధీ ఆస్పత్రిలోనూ కరోనా సోకిన నిండు గర్భిణులను గాంధీ వైద్యులు శస్త్ర చికిత్స చేసి తల్లీ బిడ్డలను కాపాడిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. ప్రస్తుతం వారు కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. అప్పుడే పుట్టిన నవజాత శిశువును తల్లి నుంచి వైరస్ సోకుంతుందని, అలా సోకకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు తెలిపారు.