Corona Vaccine: కరోనా మూడో వేవ్‌ను ఎదుర్కొనేందుకు GHMC సన్నద్ధం

*GHMC కాలనీల్లో వ్యాక్సినేషన్ కేంద్రాల ఏర్పాటు *బస్తీ దవాఖానాలు, సివిల్ ఆసుపత్రుల్లో వ్యాక్సిన్

Update: 2021-11-22 03:17 GMT

ఇవాళ్టి నుంచి కరోనా వ్యాక్సిన్ రెండో డోస్ స్పెషల్ డ్రైవ్(ఫైల్ ఫోటో)

Corona Vaccine: కరోనా మూడో వేవ్ సంకేతాలు మళ్లీ కనిపిస్తున్నాయి. అందుకోసం తెలంగాణ ప్రభుత్వం ముందుగానే అలెర్ట్ అయ్యింది. కరోనాతో పోరాడాలంటే వ్యాక్సినేషన్ తప్పనిసరి. అందుకోసం ఇవాళ్టి నుండి హైదరాబాద్‌లో రెండో డోస్ వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపడుతున్నారు.

కరోనా మహమ్మారి నుండి వాక్సిన్ మాత్రమే కాపాడగలిగింది అనేది అందరూ నమ్ముతున్న నిజం. కోవిడ్ వాక్సినేషన్ వల్లే రెండవ వేవ్ నుంచి కూడా బయటపడగలిగాం. అందుకే మరోసారి స్పెషల్ డ్రైవ్ నిర్వహించేందుకు GHMC ఏర్పాట్లు చేసింది.

GHMC పరిధిలో 4 వేల 846 కాలనీలలో గతంలో మొదటి డోస్ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ఇవాళ్టి నుంచి ప్రారంభమయ్యే రెండో డోస్ వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో భాగంగా కాలనీల్లో ఇంటింటికి వెళ్లి వ్యాక్సిన్ వేసుకోని వారి జాబితాను తయారు చేస్తారు.

మరుసటి రోజు నుంచి వ్యాక్సిన్ వేసుకునే విధంగా సిబ్బంది కృషి చేస్తారు. రెండు డోసులు పూర్తయిన వారి ఇంటికి స్టిక్కర్ కూడా వేస్తారు. కాలనీలలో వ్యాక్సినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేసింది GHMC. బస్తీ దవాఖానాలు, సివిల్ ఆసుపత్రుల్లో వ్యాక్సిన్ వేయనున్నారు. 

Tags:    

Similar News