Corona Vaccine Covaxin: అందరికీ అందుబాటు ధరలో కరోనా వ్యాక్సిన్.. భారత్ బయోటెక్ క్లారిటీ!
Corona Vaccine Covaxin: చాపకింద నీరులా ప్రపంచ వ్యాప్తంగా విస్తరించిన కరోనా వైరస్ అన్ని దేశాలను వణికిస్తుంది. దీంతో అప్రమత్తమయిన దేశాలు అన్నీ కరోనాను తరిమి కొట్టి మానవాళిని కాపాడే వ్యాక్సిన్ రూపకల్పనకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి.
Corona Vaccine Covaxin: చాపకింద నీరులా ప్రపంచ వ్యాప్తంగా విస్తరించిన కరోనా వైరస్ అన్ని దేశాలను వణికిస్తుంది. దీంతో అప్రమత్తమయిన దేశాలు అన్నీ కరోనాను తరిమి కొట్టి మానవాళిని కాపాడే వ్యాక్సిన్ రూపకల్పనకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే ఆక్సిఫర్డ్ యూనిర్సిటీ, రష్యా తయారు చేసిన వ్యాక్సిన్, అమెరికాకు చెందిన మోడెర్నా సంస్థలు రూపొందించాయి. అంతే కాదు వాటిని క్లినికల్ ట్రయల్స్ కూడా చేసాయి. అయితే వ్యాక్సిన్లు క్లినికల్ ట్రయల్స్‌లో ఆశాజనకమైన పనితీరు కనబరుస్తున్నాయి. విదేశీ వ్యాక్సిన్లు మాత్రమే కాకుండా తెలంగాణలోని హైదరాబాద్ నగరంలో ఉన్న భారత్ బయోటెక్ సంస్థ తయారు చేసిన కొవాగ్జిన్ కూడా మొదటి దశ ప్రయోగం విజయవంతంగా పూర్తి చేసి ప్రజల్లో ఆశలు రేపుతోంది. ప్రస్తుతం మనుషులపై రెండో దశ ప్రయోగాలు జరుగుతున్నాయి.
ఇక ఈ వ్యాక్సిన్ తయారు చేయడం మాత్రమే కాదు పేదలకు సైతం వ్యాక్సిన్ అందాలి. ఈ క్రమంలోనే భారత్ బయోటెక్ సంస్థ తయారు చేస్తున్న కరోనా వ్యాక్సిన్ ని అతి తక్కువ ధరకే ప్రజలకు అందుబాటులోకి తెస్తామని సంస్థ ఎండీ డాక్టర్ ఎల్లా కృష్ణ తెలిపారు. బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రొటావైరస్ వ్యాక్సిన్లను ఒక్క డాలర్ కంటే తక్కువ ధరకే అందుబాటులోకి తెచ్చామన్నారు. కొవాగ్జిన్ ధరను ఇంకా నిర్ణయించలేదని కంపెనీ ప్రతినిధి స్పష్టం చేశారు. కానీ ఈ కొవాగ్జిన్‌ను తక్కువ ధరకే అందుబాటులోకి తేస్తామని ఆయన తెలిపారు. కరోనా వ్యాక్సిన్ నాణ్యంగా ఉంటుందని.. అందుబాటులో ధరలో ఉంటుందని మాత్రమే తమ ఎండీ తెలిపారని కంపెనీ ప్రతినిధి తెలిపారు. ఇప్పటికే కోవ్యాక్సిన్ వాటర్ బాటిల్ కంటే తక్కువ ధరకు భారత్ బయోటెక్ అందుబాటులోకి తెస్తున్నట్లు కథనాలు వచ్చాయన్నారు. ఈ వ్యాక్సిన్‌ను ఆగష్టు 15 నాటికి అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఐసీఎంఆర్ ప్రకటించింది. పుణేలోని వైరాలజీ ల్యాబ్, ఐసీఎంఆర్‌లతో కలిసి భారత్ బయోటెక్ సంస్థ కొవాగ్జిన్‌ను రూపొందించిన సంగతి తెలిసిందే.