Nehru Zoological Park: జూ పార్క్‌ సిబ్బంది నిర్లక్ష్యంతోనే సింహాలకు కరోనా

Nehru Zoological Park: దేశంలో తొలిసారి అడవి జంతువులకు కోవిడ్‌ సోకడం ఆందోళనకరంగా మారింది.

Update: 2021-05-06 08:06 GMT

Nehru Zoological Park: జూ పార్క్‌ సిబ్బంది నిర్లక్ష్యంతోనే సింహాలకు కరోనా

Nehru Zoological Park: దేశంలో తొలిసారి అడవి జంతువులకు కోవిడ్‌ సోకడం ఆందోళనకరంగా మారింది. హైదరాబాద్‌ నెహ్రూ జూలాజికల్‌ పార్క్‌లో 8 సింహాలకు ఒకేసారి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. జూ పార్క్‌ సిబ్బంది నిర్లక్ష్యంగా కారణంగానే సింహాలకు కరోనా సోకినట్లు అధికారులు చెబుతున్నారు. గత నెల 24 నుంచి జూ పార్క్‌లో 8 సింహాలు ఆహారం తీసుకోవడం లేదు. వాటికి జలుబు, దగ్గు లాంటి లక్షణాలు ఉండడంతో ఆర్టీపీసీఆర్ టెస్ట్ నిర్వహించగా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. సింహాలకు కరోనా నిర్థారణ అయ్యాక.. జూ పార్క్ సిబ్బందికి టెస్ట్ చేయగా 30 మందికి పాజిటివ్‌గా తేలింది. వాళ్లు కోవిడ్ నిబంధనలు పాటించకపోవడం వల్ల వైరస్‌ జంతువులను సైతం ఇబ్బంది పెడుతోందని అధికారులు నిర్థారించారు.

Tags:    

Similar News