తెలంగాణకు భారీ ఊరట.. కరోనా థర్డ్ వేవ్ ముగిసినట్టే..!

Corona Third Wave: కరోనా థర్డ్ వేవ్ యావత్ ప్రపంచానికి దడ పుట్టించింది.

Update: 2022-02-08 04:15 GMT

తెలంగాణకు భారీ ఊరట.. కరోనా థర్డ్ వేవ్ ముగిసినట్టే..!

Corona Third Wave: కరోనా థర్డ్ వేవ్ యావత్ ప్రపంచానికి దడ పుట్టించింది. కరోనా థర్డ్ వేవ్ ఇక ముగిసినట్టేనని వైద్యవర్గాలు అంటున్నాయి. తెలంగాణలో మూడోవేవ్‌ కరోనా కేసులు పతాక స్థాయికి చేరడానికి 17 రోజుల సమయమే పట్టిందని పేర్కొన్నాయి. జనవరి మూడో వారంలో కేసులు పతాక స్థాయికి చేరాయని తెలిపాయి. ఆ తర్వాతి నుంచి క్రమంగా కేసులు తగ్గుముఖం పట్టాయని వెల్లడించాయి. ప్రస్తుతం రోజు నమోదయ్యే కొత్త కేసుల సంఖ్య కూడా తగ్గుతోంది.

వచ్చే వారం, పది రోజుల్లోగా రోజువారీ కేసుల సంఖ్య సగటున 200- 300కు పడిపోయే అవకాశాలు ఉన్నాయని వైద్యశాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఒమైక్రాన్‌ కరోనా వేరియంట్‌లోని బీఏ.2 ఉపజాతి వల్లే మూడోవేవ్‌లో కరోనా కేసులు ఎక్కువగా నమోదయ్యాయని వెల్లడించాయి. మూడోవేవ్‌లో ప్రధానంగా పట్టణ ప్రాంతాల్లోనే కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. పల్లెలతో పోలిస్తే పట్టణాల్లో జనసాంద్రత ఎక్కువగా ఉంటుంది. అక్కడి బహిరంగ ప్రదేశాల్లో జన సంచారం కూడా ఎక్కువే. దీనివల్ల పట్టణాల్లో కరోనా వ్యాప్తికి అనుకూల వాతావరణం ఏర్పడింది. కేసులు భారీగా నమోదై కలవరపరిచినా చాలామందిలో ఇన్ఫెక్షన్‌ తీవ్రత స్వల్పంగానే ఉండటంతో ఆస్పత్రుల్లో చేరికలు కూడా తక్కువగానే జరిగాయి.

కొవిడ్‌ రోగుల్లో చాలామంది ఇళ్ల వద్దే ఐసోలేషన్‌లో ఉంటూ కొవిడ్‌ చికిత్స పొందారు. వైద్యశాఖ లెక్కల ప్రకారం ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో మొత్తం అడ్మిషన్లు 5వేలకు మించలేదు. పడకలు, ఆక్సిజన్‌, వెంటిలేటర్‌ డిమాండ్‌ కూడా అసలు కనిపించలేదు. 2021 డిసెంబరు 26న ఒమైక్రాన్‌ వ్యాప్తి మొదలైంది. ఆ రోజు నుంచి నేటి వరకు రాష్ట్రంలో దాదాపు లక్ష కేసులు నమోదయ్యాయి. కొవిడ్‌ వ్యాప్తిరేటు 3.5 శాతానికి చేరింది. కానీ కొన్ని జిల్లాల్లో వ్యాప్తిరేటు 20 శాతం దాటింది. ప్రస్తుతం రోజువారీ కేసులు 2వేల వరకు వస్తున్నాయి. కరోనా వ్యాప్తిరేటు 2.5 శాతానికి తగ్గింది. దీంతో రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ఊపిరి పీల్చుకుంది. మూడోవేవ్‌ నేపథ్యంలో జనవరి 21న ఫీవర్‌ సర్వే చేపట్టారు. 15రోజుల్లో అన్ని జిల్లాల్లో తొలివిడత సర్వే పూర్తి చేశారు. 18 జిల్లాల్లో రెండో విడత సర్వే కొనసాగిస్తున్నారు.

కొత్తవేవ్‌ల గురించి భయపడక్కర్లేదు ప్రస్తుతం మూడోవేవ్‌లో రోజూవారీ కేసుల సంఖ్య తగ్గుతోంది. పది రోజుల తర్వాత రోజూవారీ కేసుల సంఖ్య 1000కిలోపే నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక మూడోవేవ్‌ దాదాపుగా ముగిసినట్టే. కొత్త వేవ్‌ల గురించి ప్రజలు భయపడనవసరం లేదు. 

Full View


Tags:    

Similar News