Corona Rules Violation Cases in Telangana: తెలంగాణ‌లో కరోనా నిబంధనల ఉల్లంఘన.. 35,308 కేసులు నమోదు

Corona Rules Violation Cases in Telangana: తెలంగాణ‌లో కరోనా వైరస్ ఉధృతి పెరుగుతుంది. రోజురోజుకీ వేల సంఖ్యల్లో కేసులు నమోదు అవడమే కాకుండా పదుల సంఖ్యల్లో మరణాలు సంభవిస్తున్నాయి.

Update: 2020-07-29 16:52 GMT
Corona Rules Violation Cases in Telangana

Corona Rules Violation Cases in Telangana: తెలంగాణ‌లో కరోనా వైరస్ ఉధృతి పెరుగుతుంది. రోజురోజుకీ వేల సంఖ్యల్లో కేసులు నమోదు అవడమే కాకుండా పదుల సంఖ్యల్లో మరణాలు సంభవిస్తున్నాయి. రాష్ట్ర రాజధాని హైద‌రాబాద్ లో వైరస్ విజృంభిస్తూ.. నగర ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. ఈ నేప‌థ్యంలో.. కరోనా నియంత్రణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని హైకోర్టుకు ప్రభుత్వం వివరించింది. మార్చి 23తో పోలిస్తే కరోనా కేసులు దేశవ్యాప్తంగా 1,142 రెట్లు పెరగగా.. తెలంగాణలో 497 రెట్లు పెరిగాయని పేర్కొంది. రాష్ట్రంలో కరోనా పరీక్షలు జూన్ 29న 3,457 చేయగా… ఈనెల 25 నాటికి 15,654కి పెరిగాయని సర్కారు వివరించింది. పరీక్షల్లో కరోనా పాజిటివ్ శాతం 27.3 శాతం నుంచి 10.18శాతానికి తగ్గిందని వెల్లడించింది.

మాస్కులు, భౌతిక దూరం పాటించని వారిపై, నిబంధనలకు విరుద్ధంగా వివాహాలు, అంత్యక్రియలు, జనసమీకరణ చేసిన వారిపై పోలీసులు కేసులు నమోదు చేశారని నివేదికలో ప్రభుత్వం వివరించింది. రాష్ట్ర వ్యాప్తంగా మాస్కులు ధరించని కారణంతో ఇప్పటి వరకు 35,308 కేసులు నమోదు అయ్యాయి. అలాగే భౌతిక దూరం పాటించనందుకు రాష్ట్రవ్యాప్తంగా 1211 కేసులు నమోదు అయ్యాయి. ఇక కరోనా నిబంధనలకు విరుద్ధంగా జనసమీకరణపై 82 కేసులు నమోదు అయ్యాయి. వివాహాల్లో కరోనా నిబంధనలు పాటించనందుకు 24 కేసులు నమోదు కాగా, 101 మందిని అరెస్ట్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా అంత్యక్రియలు జరిపినందుకు హైదరాబాద్, రాచకొండ, రామగుండం, నిజమాబాద్, వికారాబాద్​లలో 6 కేసులు నమోదు కాగా, 27 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు

Tags:    

Similar News