Minister Harish Rao tested Corona positive : మంత్రి హరీశ్ రావుకు కరోనా పాజిటివ్

Minister Harish Rao tested Corona positive : తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు విస్తరిస్తూనే ఉన్నాయి.

Update: 2020-09-05 06:11 GMT

మంత్రి హరీశ్ రావు ఫైల్ ఫోటో 

Minister Harish Rao tested Corona positive : తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు విస్తరిస్తూనే ఉన్నాయి. సామాన్య ప్రజలతో పాటు ఇప్పటి వరకు ఎంతో మంది నాయకులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు కరోనా మహమ్మారి బారిన పడుతున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీశ్ రావు కూడా కరోనా బారిన పడ్డారు. ఈ నెల 7వ తేది నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అసెంబ్లీలో కరోనా టెస్టులు నిర్వహించారు. కాగా ఈ టెస్టుల్లో మంత్రి హరీశ్ రావుకి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దీంతో మంత్రి హరీశ్ రావు ఈ విధంగా ట్వీట్ చేసారు. నాకు కరోనా పాజిటివ్ వచ్చింది, నేను ఆరోగ్యంగానే ఉన్నాను. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. గత కొద్దిరోజులుగా నన్ను కలిసిన వారు కరోనా టెస్టులు చేయించుకోండి అని తెలిపారు.

ఇక పోతే తెలంగాణ రాష్ట్రంలో నిన్న రాత్రి 8 గంటల వరకు కొత్తగా 2,511 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. 11 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,38,395కి చేరింది. మృతుల సంఖ్య 877 కి పెరిగింది. నిన్న ఒక్క రోజే 2,579 మంది కరోనా నుండి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి వరకూ డిశ్చార్జి అయిన వారి సంఖ్య 1,04,603కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 32,915 యాక్టివ్ కేసులు ఉన్నాయని, వీరిలో 25,729 మంది హోం క్వారంటైన్‌, హోం ఐసోలేషన్‌లో ఉన్నారని తెలిపింది. ఇక, మరణాల రేటు దేశవ్యాప్తంగా 1.73 శాతంగా ఉంటే తెలంగాణలో 0.63 శాతంగా ఉందని, కోలుకున్నవారి సంఖ్య 75.5 శాతానికి పెరిగిందని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.

Tags:    

Similar News