ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో వారం రోజులుగా పెరుగుతున్న కేసులు

Warangal: రోజు రోజుకు పెరుగుతున్న కరోనా కేసులు

Update: 2022-06-12 04:14 GMT

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో వారం రోజులుగా పెరుగుతున్న కేసులు

Warangal: మూడు విడతల్లో తన ప్రతాపం చూపింది మహమ్మారి కరోనా. కరోనా బారిన పడిన వారి జీవితాలను చిందరవందర చేసింది. కొందరి ప్రాణాలను సైతం తీసింది. మరికొందరిని ఆరోగ్యపరంగా ఆగం చేసింది. ఆరోగ్య రక్షణకు ప్రజలు స్వతహాగా ప్రభుత్వ నిబంధనలను పాటించడం. వ్యాక్సినేషన్ తో కట్టడి చేయడంతో ఉధృతి తగ్గిపోయింది. కానీ..మళ్లీ నేనున్నా..అంటు కరోనా చాప కింద నీరులా రోజురోజు కు కేసుల సంఖ్యను పెంచుతూ వస్తోంది. వారం రోజులుగా వరంగల్ జిల్లాలో పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. రేపటి నుంచి విద్యాసంస్థలు పున ప్రారంభం కానున్నాయి. ఈ టైంలో మళ్లీ కరోనా పంజా విసురుతుందని తల్లిదండ్రులు టెన్షన్ పడుతున్నారు. ఇప్పటికే ప్రైవేట్ స్కూల్లో, కళాశాలల్లో చదివే విద్యార్థులకు లక్షల్లో ఫీజులు చెల్లించి పుస్తకాలు, డ్రస్సులు కొనుగోలు చేశారు.. మళ్లీ కరోనా వస్తుందనే భయంతో కలవరపడుతున్నారు వరంగల్ జిల్లా ప్రజలు.

మన రాష్ట్రంలో ఫోర్త్ వేవ్ కరోనాతో పెద్ద ప్రమాదం లేదని వైద్యులు అంటున్నారు. పాజిటివ్ కేసులు పెరుగుతున్నా.. మరణాలు పెద్దగా జరగడం లేదు. స్వల్ప లక్షణాలు మాత్రమే కనిపిస్తాయంటున్నారు. నాలుగో దశ కరోనా గురించి ఎవరూ పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు డాక్టర్ శ్రీనివాస్.

మూడేళ్లుగా కరోనాతో ప్రజలు ఎంతో ఇబ్బందులు పడ్డారు. ఉపాధి దొరకక, ఒక పూట తింటూ మరొక పూట పస్తులు ఉంటూ కాలం గడిపారు. నాలుగో దశలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే హాస్పిటల్లో కరోనాకు సంబంధించిన ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉ:ది. ప్రాణనష్టం జరగకుండా ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలని ప్రజల నుంచి డిమాండ్ వినిపిస్తోంది.

Tags:    

Similar News