Telangana Rains: తెలంగాణకు కొనసాగుతోన్న ఐఎండీ హెచ్చరికలు.. 4 జిల్లాలకు రెడ్ అలర్ట్, 13 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

Telangana Rains: పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు

Update: 2023-07-22 03:38 GMT

Telangana Rains: తెలంగాణకు కొనసాగుతోన్న ఐఎండీ హెచ్చరికలు.. 4 జిల్లాలకు రెడ్ అలర్ట్, 13 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

Telangana Rains: ఒడిశా తీర ప్రాంతాన్ని ఆనుకొని వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా పయనించే అవకాశం ఉన్నట్టు భారత వాతావరణ విభాగం వెల్లడించింది. దీని ప్రభావంతో వచ్చే 24 గంటల్లో తెలంగాణ, కోస్తాంధ్ర, రాయలసీమల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. సోమవారం బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనున్నట్టు పేర్కొంది. దీని ప్రభావంతో తెలంగాణ, ఏపీ, ఒడిశా, మధ్యప్రదేశ్‌, కేరళ, కర్ణాటకలలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది. ఈ నేపథ్యంలో తెలంగాణలోని 4 జిల్లాలకు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. 13 జిల్లాలకు ఆరెంజ్‌, 15 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. భారీ వర్షాలతోపాటు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్టు తెలిపింది.

Tags:    

Similar News