Telangana: ఆరు గ్యారెంటీల దరఖాస్తు పత్రం విడుదల చేసిన సీఎం రేవంత్‌రెడ్డి
Telangana: ప్రజాపాలన లోగో ఆవిష్కరించిన సీఎం రేవంత్‌రెడ్డి
Telangana: ప్రజా పాలన ద్వారా ప్రభుత్వమే ప్రజల వద్దకు వెళ్తుందన్నారు సీఎం రేవంత్‌రెడ్డి. తెలంగాణ సచివాలయంలో ప్రజాపాలన, లోగో, దరఖాస్తులను ఆయన ఆవిష్కరించారు. రేపటి నుంచి జనవరి 6వ తేదీ వరకు గ్రామ సభల్లో దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందిస్తామన్నారు సీఎం రేవంత్‌రెడ్డి. గతంలో గడీల లోపల జరిగిన పాలనను.. ఇప్పుడు గ్రామాల్లోకి తీసుకెళ్తున్నామని అన్నారు. గ్రామసభల్లో దరఖాస్తు ఇవ్వలేని వారు పంచాయతీ కార్యాలయాల్లో ఇవ్వొచ్చని తెలిపారు సీఎం రేవంత్‌రెడ్డి. నిస్సహాయులకు సాయం అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు.