Congress MLA Jaggareddy Fires in KCR Government: కరోనా కంటే ముందే రాష్ట్రం దివాళా

Congress MLA Jaggareddy Fires in KCR Government: తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్‌ రాక ముందే రాష్ట్రం దివాళా తీసిందని సంగారెడ్డి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపించారు.

Update: 2020-07-01 13:30 GMT
Jaggareddy (File Photo)

MLA JaggaReddy fires on KCR Govt: తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్‌ రాక ముందే రాష్ట్రం దివాళా తీసిందని సంగారెడ్డి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపించారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద బుధవారం ఆయన మాట్లాడుతూ పేద కుటుంబాలకు బియ్యంతో పాటు నిత్యావసరాలు అందజేయాలని డిమాండ్‌ చేశారు. రైతుబంధు సాయం అడపా దడపా జారీ చేసి ప్రకటనలు మాత్రం ఘనంగా ఇచ్చారని ప్రభుత్వం మీద మండిపడ్డారు. ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించి కరోనా బాధితులకు నాణ్యమైన వైద్యం, పోషకాహారం అందించాలని కోరారు. కరోనాకు ఇప్పట్లో మందు వచ్చే అవకాశం కనిపించడం లేదన్నారు. గాంధీ ఆసుపత్రిలో సదుపాయాలు లేకపోవడం వల్ల అనేక సమస్యలు వస్తున్నాయని జగ్గారెడ్డి ఆరోపించారు. ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ ఆరోగ్యశ్రీ కింద చికిత్స చేయాలని కోరారు. తక్షణమే కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్‌ చేశారు. పేదలు ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లలేక ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చడంపై రెండు రోజుల్లో ప్రకటన రాకపోతే ఒక్కరోజు దీక్ష చేపట్టనున్నట్లు జగ్గారెడ్డి తెలిపారు.

''కాంగ్రెస్‌ హయాంలో ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ కింద అనేక జబ్బులకు వైద్యం అందేదన్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కరోనా చికిత్సకు ఆరోగ్యశ్రీ లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమైక్య రాష్ట్రంలో 90శాతం వైద్య ఖర్చులు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి ఇచ్చేవారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకునే స్థోమత లేకపోవడంతో పేదలు అవస్థలు పడుతున్నారన్నారు. కరోనా పాజిటివ్‌ కేసుల బులిటెన్‌ విడుదల కోసమే వైద్యశాఖ మంత్రి ఉన్నట్లు కనిపిస్తోందన్నారు.   

Tags:    

Similar News