విమర్శలు చేసే ముందు మీ పేరు, ఫోన్ నెంబర్ పెట్టండి : ఎమ్మెల్యే జగ్గారెడ్డి
తెలంగాణలో కాంగ్రెస్ కి కొత్త చీఫ్ రావడం అన్నది పక్కా. కానీ ఎప్పుడు అనేది మాత్రం క్లారిటీ లేదు. ఇదిగో అదిగో అంటూ నెలలు గడిచిపోతున్నాయి. పీసీసీ గా కొనసాగడానికి ఉత్తమ్ కుమార్ సుముఖంగా లేకపోవడంతో కొత్త చీఫ్ నియమించాలని కాంగ్రెస్ అధిష్టానం కూడా దృష్టి పెట్టింది. అయితే ఆ పదవికి రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పోటీపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు.
జగ్గారెడ్డి వ్యాఖ్యలు యధావిధిగా.. పీసీసీ అవకాశం నాకు ఇవ్వండి ప్లీస్, సోనియా, రాహుల్ గాంధీ కి నా విన్నపం..సీనియర్ నాయకుల సహకారంతో పార్టీ బలోపేతానికి కృషి చేస్తా..అలాగే సెకండ్ లీడర్ షిప్,జిల్లా,మండల,గ్రామ స్థాయి నాయకులు, కార్యకర్తల సమన్వయంతో ముందుకు వెళ్తా..గాంధీభవన్ పార్టీ ఆఫీస్ లో పూర్తి స్థాయి సమయం ఇచ్చి పని చేస్తున్న నాయకుల సహకారం కూడా తీసుకొని పని చేస్తా. మండల స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు సమయం ఇచ్చి తిరుగుతా. అవసరమనుకుంటే గ్రామాల్లో కూడా తిరుగుతా. నా స్టేట్మెంట్ లకు ఎవరు కన్ఫ్యూజ్ కావొద్దు. నా ప్రతి స్టేట్మెంట్ కి ఒక వ్యూహం ఉంటది. సమయం వచ్చిన్నపుడు అందరికి తెలిస్తుంది. ప్రజల నాడీ బట్టే మనం పని చేయాలి, నేను ఢిల్లీ కి వెళ్లి పైరవీలు చేయలేను. మీడియా ద్వారానే నేను మాట్లాడే మాటలు రాష్ట్రం లో ఉన్న కాంగ్రెస్ పార్టీ శ్రేయోభిలాషులు సోనియా,రాహుల్ గాంధీ కి పంపాలని కోరుతున్నాను, జగ్గారెడ్డి వ్యక్తిత్వం తెలియక కొందరు సోషల్ మీడియా లో టీఆర్ఎస్ కోవర్టునని ప్రచారం చేస్తున్నారు. చాలా మంది నాయకులు ప్యాంట్, షార్ట్ వేసుకున్నాక రాజకీయాల్లోకి వచ్చారు. కానీ నేను నిక్కర్ వేసుకున్నపుడే రాజకీయాల్లోకి వచ్చాను, అప్పుడు నా వయసు 12 ఏళ్లు..కొందరు పిచ్చివాల్లు ఎవనికోసమో నా వ్యక్తిత్వం దెబ్బతీసే ప్రయత్నం సోషల్ మీడియా లో చేస్తున్నారు. విమర్శ చేసే ముందు మీ పేరు,ఫోన్ నెంబర్ పెట్టండి. నేను మీ ఇంటికి వచ్చి మీ అనుమానాలు పై చర్చిస్తా, నా వ్యక్తిత్వం గురించి అవగాహన ఉన్న నాయకులకు, ప్రజలకు తెలుసు జగ్గారెడ్డి అమ్ముడుపోతాడా లేదో నాగురించి వైఎస్ కు తెలుసు వైఎస్ లేడుకాబట్టి కేవీపీని రోషయ్యను కిరణ్ కుమార్ రెడ్డిని అడగండి అని జగ్గారెడ్డి అన్నారు.