మరియమ్మ లాకప్ డెత్‌పై గవర్నర్‌కు కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు
Mariyamma Lockup Death: టీఆర్ఎస్ ప్రభుత్వం తీరుపై కాంగ్రెస్ నేతల బృందం గవర్నర్ తమిళసైకు ఫిర్యాదు చేసింది.
Mariyamma Lockup Death: టీఆర్ఎస్ ప్రభుత్వం తీరుపై కాంగ్రెస్ నేతల బృందం గవర్నర్ తమిళసైకు ఫిర్యాదు చేసింది. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులు, గిరిజనుల లాకప్ డెత్‌లు పెరిగాయని గవర్నర్‌కు తెలిపారు. పోలీసులకు ముఖ్యమంత్రి ఇచ్చిన శ్వేచ్ఛతోనే సమస్య మొదలైందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కును టీఆర్ఎస్ ప్రభుత్వం కాలరాస్తోందని దుయ్యబట్టారు. మరియమ్మ లాకప్ డెత్‌కు కారకులపై చర్యలు తీసుకోవాల్సిందిగా గవర్నర్‌ను కోరినట్లు కాంగ్రెస్ నేతలు తెలిపారు.
మాజీ మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, దళితులపై జరుగుతున్న దాడులపై గవర్నర్‌కు వివరించామని తెలిపారు. తెలంగాణలో పోలీసులకు, టీఆర్ఎస్ నేతలకు తేడా లేదని వ్యాఖ్యానించారు. పోలీసులు.. టీఆర్ఎస్ పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో ఫ్రెండ్లీ పోలీసింగ్ ఆచరణలో లేదని శ్రీధర్‌బాబు ధ్వజమెత్తారు.