Ponnala Lakshmaiah Demands President Rule In Telangana: తెలంగాణలో రాష్ట్రపతి పాలన పెట్టాల్సిందే.. పొన్నాల డిమాండ్

Ponnala Lakshmaiah Demands President Rule In Telangana: తెలంగాణ ప్రజల అవసరాలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత, పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్యయ్య మండిపడ్డారు.

Update: 2020-07-08 06:27 GMT
Ponnala Lakshmaiah Demands President Rule In Telangana

Ponnala Lakshmaiah Demands President Rule In Telangana: తెలంగాణ ప్రజల అవసరాలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత, పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్యయ్య మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన పూర్తిగా గాడి తప్పిందని ఆయన విమర్శించారు. మంగళవారం పొన్నాల లక్ష్మయ్య ఫేస్‌బుక్ లైవ్ ద్వారా మాట్లాడుతూ కరోనా విజృంభించి జనం అల్లాడుతుంటే సీఎం కేసీఆర్ పట్టించుకోకుండా ఎక్కడికో వెళ్లిపోయారని ఆయన మండిపడ్డారు. తెలంగాణలో ప్రస్తుతం పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలని పొన్నాల డిమాండ్ చేశారు. కరోననా సమయంలో జనం బయటకు వచ్చే పరిస్థితి లేదని, ఇలాంటి పరిస్థితుల్లో పోలీసులను బందోబస్తుగా ఉంచి రోడ్లను దిగ్బంధనం చేసి కూల్చడం ఏంటని ప్రశ్నించారు.

పాలనలో కేసీఆర్ పూర్తిగా విఫలం అయ్యారని, కరోనా కట్టడిలో ప్రభుత్వం చేతులెత్తేసిందని వ్యాఖ్యానించారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అనివార్యంలా ఉందని పొన్నాల అభిప్రాయపడ్డారు. కేంద్రం ఈ విషయంలో ఆలోచించాలని కోరారు. ఇలాంటి సమయంలో సచివాలయం కూల్చడం వంటి పిచ్చి తుగ్లక్ పాలన ఎక్కడ ఉండదని ఎద్దేవా చేశారు. చివరికి కరోనా కట్టడిపై సమీక్ష కోసం గవర్నర్ తమిళిసై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శిని పిలిస్తే వెళ్లడం లేదని అన్నారు. గత 13 రోజులుగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడ ఉన్నారో ఎవరికీ తెలియడం లేదని గుర్తు చేశారు.

'కరోనాతో రోజురోజుకూ భయానక పరిస్థితి ఏర్పడుతోందని అన్నారు. రాష్ట్రంలో కరోనా పరీక్షలు, రోగులకు చికిత్స సరిగ్గా చేయడం లేదు. సీఎం గత పది రోజులుగా కనిపించడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం చెబుతున్నా సరే, రాష్ట్ర ప్రభుత్వం వినిపించుకోవడం లేదని బీజేపీ నాయకులే అంటున్నారు. కాబట్టి, కేంద్రం కలగజేసుకుని, పెద్దలతో మాట్లాడి రాష్ట్రంలో రాష్ట్రపతిపాలన పెట్టించండి.'' అని పొన్నాల మాట్లాడారు.


Tags:    

Similar News