Bhatti Vikramarka: ఏ జాగ్రత్తలు లేకుండా ఇప్పుడు స్కూల్స్ ఓపెన్ అంటే ఎలా..?
Bhatti Vikramarka: అన్‌లాక్‌లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం విద్యాసంస్థలు ఓపెన్ చేయడంపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్పందించారు.
Bhatti Vikramarka: అన్‌లాక్‌లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం విద్యాసంస్థలు ఓపెన్ చేయడంపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్పందించారు. జులై 1 నుంచి స్కూల్స్ ఓపెన్ చేస్తామనడం సరైంది కాదని విమర్శించారు. ఒక వేళ అలా చేయాలంటే జులై 1 లోపు పిల్లలకు టీకా ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకుంటే పిల్లలకు టీకా పూర్తయ్యాక స్కూల్స్ తెరవాలని అన్నారు. పిల్లల టీకాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సరైనా నిర్ణయం తీసుకోలేకపోయాయన్నారు. కరోనా థర్డ్ వేవ్ బారిన పిల్లలు పడకుండా ప్రభుత్వం ఏం జాగ్రత్తలు తీసుకుందని భట్టి ప్రశ్నించారు. ఏ జాగ్రత్తలు లేకుండా ఇప్పుడా స్కూల్స్ ఓపెన్ అంటే ఎలా అంటూ ప్రశ్నించారు.