Telangana Congress Leader Bhatti Vikramarka: దళితుల పై జరుగుతున్న దాడులు గురించి గవర్నర్ కి ఫిర్యాదు చేస్తాం
Telangana Congress Leader Bhatti Vikramarka: తెలంగాణ కాంగ్రెస్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మీడియా సమావేశంలో రాష్ట్రంలో ని పరిస్థితులు గురించి మాట్లాడారు..
Telangana Congress Leader Bhatti Vikramarka: తెలంగాణ కాంగ్రెస్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మీడియా సమావేశంలో రాష్ట్రంలో ని పరిస్థితులు గురించి మాట్లాడారు.. తెలంగాణ రాష్ట్రంలో అత్యంత దయానియమైన పరిస్థితులు ఉన్నాయి అని.. ప్రజలు ఆత్మ గౌరవం కోసం పోరాటం చేసి, ఎంతో మంది తమ ప్రాణాలను పణంగా పెట్టి తెచ్చుకున్న తెలంగాణ లో దళితుల పై దాడులు జరగడం భాధా కారమని.. దళితి వర్ఘనికి రాజ్యాంగ రక్షణ కరువు అయిందని.. తెచ్చుకున్న తెలంగాణ లో దళితుల పై దాడులు ఆగడం లేదు. దళితుల పై సిరిసిల్ల దగ్గర నుంచి మొదలై గజ్వేల్ నుంచి రాజపూర్ వరకు దాడులు జరుగుతున్నాయి అని.. ఆ దాడులపై రాష్ట్ర డీజీపీ కి ఫిర్యాదు చేస్తే కనీసం స్పందన డీజీపీ నుంచి లేదుఅని అయన విమర్శించారు.
అంతే కాదు రాష్ట్రంలో దళితులపై జరుగుతున్నా దాడులుపై, పెరుగుతున్న కరోనా కేసులు.. వంటి అంశాలను గవర్నర్ తమిలిసై సౌందరరాజన్ కు మెయిల్ ద్వార ఫిర్యాదు చేస్తామని తెలిపారు. గజ్వేల్ లో ప్రభుత్వం చేసిన తప్పు వల్లే రైతు ఆత్మహత్య చేసుకున్నాడని.. ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. ముఖ్యంగా పల్లెలు, పట్టణాలు అని తేడాలేకుండా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుంది. అంతే కాదు 11 టీఎంసీలు రోజుకు ఏపీ శ్రీశైలం బ్యాక్ వాటర్ లిఫ్ట్ చెయ్యడానికి జివో రిలీజ్ చేస్తే కేసీఆర్ కనీస స్పందన లేదు. పోతిరెడ్డిపాడు పూర్తి అయితే దక్షిణ తెలంగాణ లో 25లక్షల ఎకరాలు ఎడారిగా మారే అవకాశం ఉంది. 5వ తేదీన అపెక్స్ భేటీకి పిలుస్తే సీఎం పట్టించుకోకుండా 20వ తేదీ తరువాత పెట్టమనడం అచ్చర్యానికి గురి చేసింది. 20వ తేదీ లోపు పోతిరెడ్డిపాడు టెండర్ల ప్రక్రియ పూర్తి అవుతుంది. కాబట్టే కేసీఆర్ అపెక్స్ భేటీని వాయిదా వెయ్యమన్నారు అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు.
ఇక తెలంగాణలో కరోనా కేసులు వివరాలు చూస్తే.. నిన్న(సోమవారం) రాత్రి 8 గంటల వరకు కొత్తగా 1, 286 పాజిటివ్‌కేసులునమోదైనట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. 12 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 68,946కి చేరింది. మృతుల సంఖ్య 563కి పెరిగింది. సోమవారం ఒక్క రోజే 1066 మంది హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కరోనా వైరస్ నుంచి కోలుకోని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 49,675కి చేరింది. ప్రస్తుతం 18,708 మంది చికిత్స పొందుతున్నారు. నిన్న ఒక్కరోజే 13787 మంది నమూనాలను పరీక్షించగా, 1, 286 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. రాష్ర్టంలో ఇప్పటి వరకు 5,01,025 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.