Nagarjuna Sagar: డ్యామ్ వద్ద తెలంగాణ, ఆంధ్ర అధికారుల మధ్య గొడవ

Nagarjuna Sagar: నాగార్జునసాగర్ డ్యామ్ వద్ద తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అధికారుల మధ్య శనివారం వివాదం జరిగింది.

Update: 2024-11-09 06:51 GMT

Nagarjuna Sagar: డ్యామ్ వద్ద తెలంగాణ, ఆంధ్ర అధికారుల మధ్య గొడవ

Nagarjuna Sagar: నాగార్జునసాగర్ డ్యామ్ వద్ద తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అధికారుల మధ్య శనివారం వివాదం జరిగింది. సాగర్ కుడికాలువ వాటర్ రీడింగ్ కోసం తెలంగాణ అధికారులు వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ అధికారులు వారిని అడ్డుకున్నారు.

దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం నెలకొంది.కుడికాలువ, ఎడమ కాలువకు నీటి విడుదలను ప్రతి రోజూ అధికారులు రికార్డు చేస్తారు. నీటి విడుదల అంశాన్ని రికార్డ్ చేసే సమయంలో రెండు రాష్ట్రాల అధికారులు ఉంటారు. ఇవాళ కుడి కాలువకు నీటి విడుదల రికార్డ్ చేసేందుకు వెళ్లిన తెలంగాణ అధికారులను ఏపీ అధికారులు అడ్డుకున్నారు. ఈ పరిస్థితులపై తెలంగాణ నీటిపారుదల శాఖాధికారులు కేఆర్ఎంబీకి సమాచారం ఇచ్చారు..

2023 చివరలో నాగార్జునసాగర్ డ్యామ్ పై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన అధికారుల మధ్య గొడవ జరిగింది. అంతకు ముందు కూడా ఈ రెండు రాష్ట్రాల మధ్య గొడవ జరిగింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగే రోజున ఈ గొడవ జరగడంపై అప్పట్లో కాంగ్రెస్ నాయకులు విమర్శలు చేశారు. దీనిపై ఈసీ చర్యలు తీసుకుంటుందని రేవంత్ రెడ్డి చెప్పారు. చంద్రబాబు ఏపీ సీఎంగా, తెలంగాణకు కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో కూడా ఇదే తరహాలో గొడవ జరిగింది. ఈ గొడవపై అప్పట్లో గవర్నర్ గా ఉన్న నరసింహాన్ జోక్యం చేసుకున్నారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చించారు. ఈ సమస్యకు అప్పట్లో తాత్కాలికంగా పుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు.

Tags:    

Similar News