తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలో నేరాల సంఖ్య పూర్తిగా తగ్గించేందుకు గాను ఎక్కడ చూసినా సీపీకెమెరాలను అమరుస్తున్నారు. దీంతో ఎక్కడ ఏ నేరం జరిగినా, ఎక్కడ ఎలాంటి ప్రమాదం సంభవించినా పోలీసులు నిందులను ఇట్టే పట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. 24 గంటల పాటు నగరంలో జరిగే అన్ని విషయాలను ఈ సీసీ కెమెరాలు రికార్డు చేస్తున్నాయి. ఇక ఇప్పటికే నగరంలోని అన్ని ప్రధాన కూడల్లలో, అలాగే వ్యాపార సముదాయాల్లో సీసీకెమెరాలను బిగించారు. ఇప్పుడు ఇదే క్రమంలో సికింద్రాబాద్ పరిధిలోని కర్ఖానాలో కూడా సుమారు రూ. 15 లక్షల వ్యయంతో కమ్యూనిటీ నిఘా కెమెరాలను ఏర్పాటు చేసారు. అయితే ఈ ప్రాజెక్టును కంటోన్మెంట్ ఎమ్మెల్యే జి సయన్న ఆదివారం ప్రారంభించారు.
కాగా 100 సీసీ టీవీ కెమెరాలను ఈ ప్రాజెక్టులో భాగంగా కార్ఖానాలోని వివిధ ప్రాంతాల్లో స్థానికుల భాగస్వామ్యం ద్వారా ఏర్పాటు చేశారు. కార్ఖానాలోని ధోబీ ఘాట్, కేంద్రీయ విద్యాలయ పాఠశాల, కంటోన్మెంట్ క్వార్టర్స్, అంబేద్కర్‌నగర్ ప్రాంతాలలో ఏర్పాటు చేసారు. దీంతో ఇకపై ఆయా ప్రాంతాల్లో ఎలాంటి నేరాలు జరిగినా, అలాగా ప్రమాదాలు జరిగినా పోలీసులు ఇట్టే పసిగట్ట వచ్చు. ఆయా ప్రాంతాలు ఇక నుంచి సీసీ నిఘా నీడలో ఉంటాయి. ఇక పోతే కార్ఖానా పోలీస్ స్టేషన్ స్టేషన్ హౌజ్ ఆఫీసర్ పీ. మధుకర్ స్వామి 'నేనుసైతం' కమ్యూనిటీ ప్రాజెక్టులో చురుకుగా పాల్గొన్న ప్రజలకు ప్రశంసలు తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీసీ కెమెరాల ఆధారంగా ప్రజలు సురక్షితంగా ఉండవచ్చని వారు పేర్కొన్నారు. ఏదైనా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకున్న సమయంలో ఈ సీసీ కెమెరాల ద్వారా నిందితులను సులభంగా పట్టుకోవచ్చని తెలిపారు.