దిశ నిందితుల ఎన్‌కౌంటర్ అంతా బూటకం.. సిర్పూర్కర్ కమిషన్‌ రిపోర్ట్‌లో షాకింగ్ ట్విస్ట్!

Disha Encounter: ప్రజల ఆగ్రహాన్ని కట్టడి చేసేందుకు కాల్చి చంపారు...

Update: 2022-05-20 10:18 GMT

దిశ నిందితుల ఎన్‌కౌంటర్ అంతా బూటకం.. సిర్పూర్కర్ కమిషన్‌ రిపోర్ట్‌లో షాకింగ్ ట్విస్ట్!

Disha Encounter: దిశ ఎన్ కౌంటర్ కేసుపై సిర్పూర్కర్ కమిషన్ సంచలన నివేదిక ఇచ్చింది. దిశ నిందితుల ఎన్ కౌంటర్ బూటకమని సిర్పూర్కర్ కమిషన్ తేల్చి చెప్పింది. 387 పేజీలతో సిర్పూర్కర్ కమిషన్ నివేదిక తయారు చేసింది. పోలీస్ మాన్యువల్ కు విరుద్దంగా విచారణ జరిగిందని కమిషన్ వెల్లడించింది. ప్రజల ఆగ్రహాన్ని కట్టడి చేసేందుకు ఎన్ కౌంటర్ జరిగిందని కమిషన్ స్పష్టం చేసింది.

ఈ ఎన్ కౌంటర్ లో పది మంది పోలీసులు పాల్గొన్నారని.. వీరిపై హత్యానేరం కింద కేసు నమోదు చేసి విచారించాలని కమిషన్ పేర్కొంది. అనుమానిత నిందితులను హతమార్చాలన్న ఉద్దేశ్యంతోనే కాల్పులు జరిపారన్నారు. వీరిపై ఐపీసీ 302, 201 ప్రకారం కేసులు నమోదు చే.యాలని కమిషన్ స్పష్టం చేసింది. ఈ రిపోర్టును ఈ ఏడాది జనవరిలో సుప్రీంకోర్టుకు సిర్పూర్కర్ కమిషన్ తన నివేదికను అందించింది.

ఈ కమిషన్ రిపోర్టు ఆధారంగా సుప్రీంకోర్టు విచారణ జరిపింది. పోలీస్ మాన్యువల్స్ కు విరుద్ధంగా విచారణ జరిగిందని సిర్కూర్కర్ కమిషన్ తెలిపింది. ఈ కేసును తెలంగాణ హైకోర్టుకు పంపిస్తున్నట్టు సర్వోన్నత న్యాయ స్థానం వెల్లడించింది. సిర్పూర్కర్ కమిషన్ నివేదికను సాఫ్ట్ కాపీ రూపంలో.. కేసులోని భాగస్వాములందరికీ పంపాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. నివేదికపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే చెప్పుకోవాలని సూచించింది.

అభ్యంతరాలను పరిగణలోకి తీసుకున్న తర్వాత విచారణ చేపట్టాలని తెలంగాణ హైకోర్టుకు సుప్రీం కోర్టు సూచించింది. దిశ కేసుకు సంబంధించి అన్ని రికార్డులను హైకోర్టుకు పంపించింది. సిర్పూర్కర్ కమిషన్ నివేదిక గోప్యంగా ఉంచాలని లాయర్ శ్యామ్ దివాన్ చీఫ్ జస్టిస్ ను కోరారు. అయితే నివేదికలో గోప్యం ఏమీ లేదని.. దోషి ఎవరో తేలిపోయిందని సీజేఐ ధర్మాసనం తెలియచేసింది.

తాము కమిషన్ వేశామని.. కమిటీ హైకోర్టుకు నివేదిక ఇస్తుందన్నారు. అందుకు అణుగుణంగానే ముందుకు వెళ్తామని సీజేఐ వెల్లడించింది. నివేదిక బయటపెడితే న్యాయవ్యవస్థపై ప్రభావం చూపిస్తుందని లాయర్ వెల్లడించారు. ఈ నివేదికను మరోసారి పరిశీలించే ప్రసక్తి లేదని సీజేఐ స్పష్టం చేశారు. చేశారు. దిశా కేసుకు సంబంధించి అన్నిరికార్డులను హైకోర్టుకు సీజేఐ పంపించేశారు.

Tags:    

Similar News