Bhupalpally: ప్రభుత్వ సహాయం పొందని వలస కూలీలను త్వరగా గుర్తించాలి: కలెక్టర్ అబ్దుల్ అజిమ్
ఇప్పటివరకు ప్రభుత్వ సహాయం పొందని వలస కూలీలను త్వరగా గుర్తించి వారికి సహాయo చేయాలని జిల్లా కలెక్టర్ మహమ్మద్ అబ్దుల్ అజీం తాసిల్దార్ లను ఆదేశించారు.
ఇప్పటివరకు ప్రభుత్వ సహాయం పొందని వలస కూలీలను త్వరగా గుర్తించి వారికి సహాయo చేయాలని జిల్లా కలెక్టర్ మహమ్మద్ అబ్దుల్ అజీం తాసిల్దార్ లను ఆదేశించారు.గురువారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ తాసిల్దార్ లతో సమావేశం నిర్వహించి జిల్లాలో వలస కూలీల కు ప్రభుత్వం తరఫున సహాయం అందించి ఆ వివరాలను ఆన్లైన్లో ఎలా పొందుపరచాలో వివరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కరోనా వలన జిల్లాలో చిక్కుకుపోయిన ఇతర రాష్ట్రాలకు చెందిన వలస కూలీలకు ప్రభుత్వ ఆదేశంతో జిల్లాలో ఇప్పటికే మొదటి విడతగా గుర్తించిన వలస కూలీలకు ప్రభుత్వం తరఫున బియ్యం, నగదు అందించడం జరిగిందని ఐనా జిల్లాలో ఇంకా కొంత మంది వలస కూలీలు ప్రభుత్వం సహాయం పొందలేదని తాసిల్దార్లు ప్రభుత్వ అధికారులచే టీమ్ లను వేసి మీ మండలాల్లో ప్రభుత్వం తరఫున సహాయం అందకుండా మిగిలి ఉన్న అదనపు వలస కూలీలను వెంటనే గుర్తించి వారికి ప్రభుత్వం తరఫున సహాయం అందించి ఏ ఒక్క వలసకూలీ కూడా ఆకలితో అలమటించకుండా చూడాలని ఆదేశించారు.