తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత..రోడ్లను కమ్మేసిన పొగమంచు

Cold Intensity: తీవ్ర ఇబ్బందులు పడుతున్న వాహనదారులు

Update: 2023-12-29 02:59 GMT

తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత..రోడ్లను కమ్మేసిన పొగమంచు

Cold Intensity: తెలుగు రాష్ట్రాల్లో చలి పులి పంజా విసురుతోంది. ఉష్ణోగ్రతలు కనిష్ట స్తాయికి పడిపోవడంతో ఓ వైపు పొగమంచు, మరోవైపు చలి తీవ్రతతో జనం వణికిపోతున్నారు. ఎముకలు కొరికే చలితో అల్లాడుతున్నారు. చలి పోటుకు కాళ్లు, చేతులు గడ్డ కట్టి ఏ పనికి సహకరించని పరిస్థితి ఏర్పడింది. హైదరాబాద్‌ లాంటి ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. హైదరాబాద్ నగర శివారు రోడ్లను పొగమంచు కమ్మేసింది. పెద్ద అంబర్‌పేట్ ఔటర్ రింగ్ రోడ్డు, విజయవాడ జాతీయ రహదారిపై దట్టమైన పొగమంచుతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఉమ్మడి ఆదిలాబాద్‌, శ్రీకాకుళం ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 7డిగ్రీల కన్నా తక్కువ నమోదు అవుతుండటంతో జనం గజగజ వణికిపోతున్నారు. ఇంట్లో నుంచి బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్, శ్రీకాకుళం, విశాఖ మన్యంలో అయితే చలి ఇంకాస్త పెచ్చుమీరుతోంది. కనీష‌్ణ ఉష్ణోగ్రతలు 7డిగ్రీలుగా నమోదు అవుతూ ప్రజల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు అయితే.. చలితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Tags:    

Similar News