జనగామలో సీఎం పర్యటన
Janagama: కలెక్టరేట్ కాంప్లెక్స్, పార్టీ కార్యాలయం ప్రారంభం. జిల్లా అభివృద్ధిపై సమీక్షా సమావేశం.
Janagama: ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం జనగామలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు సీఎం ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కాంప్లెక్స్ ప్రారంభిస్తారు. అనంతరం జిల్లా అభివృద్ధిపై సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. 3 గంటలకు జరిగే బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొంటారు. జనగామలో ఏర్పాటు చేసిన గులాబీ సభను నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాథోడ్ సీఎం పర్యటన ఏర్పాట్లను దగ్గరుండి పరిశీలించారు. జనగామ పట్టణం అంతా గులాబీమయం అయింది. సభకు జనగామ, పాలకుర్తి, స్టేషన్ ఘన్‌పూర్ తో పాటు ఆలేరు, వరంగల్ తూర్పు , వరంగల్ పశ్చిమ నియోజకవర్గాల నుంచి భారీగా జనాలను తరలించేందుకు ఏర్పాట్లు చేశారు.
రాజ్యాంగంపై వ్యాఖ్యలు చేసిన అనంతరం తొలిసారి కేసీఆర్ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. అయితే సీఎం కేసీఆర్ సభలో ఏం మాట్లాడుతారన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. జనగామలో ఇప్పటికే బీజేపీ, టీఆర్ఎస్ మధ్య ఘర్షణ జరిగింది. దీంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సీఎం పర్యటనను అడ్డుకుంటారని బీజేపీ నేతలను ముందస్తుగా అరెస్టులు చేశారు.