CM Revanth reddy: తెలంగాణలో వర్షాలు, వరదలపై సీఎం రేవంత్ రివ్యూ
CM Revanth reddy: 29 జిల్లాలను వరద జిల్లాలుగా ప్రకటించిన ప్రభుత్వం
CM Revanth reddy: తెలంగాణలో వర్షాలు, వరదల వల్ల ఏర్పడ్డ నష్టాలపై చేపట్టాల్సిన... పునరావాస కార్యక్రమాలు అందించాల్సిన సహాయం పునర్నిర్మాణ కార్యక్రమాలపై సీఎం రేవంత్ సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. 29 జిల్లాలను వరద జిల్లాలుగా ప్రకటించింది ప్రభుత్వం. 4 జిల్లాలను వరద ప్రభావిత జిల్లాలుగా ప్రకటించి సహాయ పునరావాస చర్యలు చేపట్టేందుకు నిధులను ప్రభుత్వం విడుదల చేయనుంది. మిగతా 25 జిల్లాలకు మూడు కోట్ల రూపాయల చొప్పున నిధులు విడుదల చేసింది ప్రభుత్వం. భారీ వర్షాలు, వరదల వల్ల సంభవించిన నష్టాలపై ఇవాళ మధ్యాహ్నంలోపు కలెక్టర్లు నివేదిక ఇవ్వాలని కోరారు సీఎస్.
వర్షాల కారణంగా ఇప్పటి వరకు 29 మంది మృతి చెందినట్లు ప్రభుత్వం తెలిపింది. వారికి ఎక్స్‌గ్రేషియా ఇవ్వడానికి వివరాలు తెలపాలని కలెక్టర్లను సీఎస్ ఆదేశించారు. పంట నష్టం, పాడిపశువుల మరణాలు ఇతర వ్యవసాయ సంబంధిత నష్టాల వివరాలతో పాటు దెబ్బతిన్న రహదారులు, కల్వర్ట్‌లు, బ్రిడ్జిలు, పాఠశాలల భవనాలు తాగునీటి సరఫరా వివరాలతో కూడిన నివేదిక పంపాలని కలెక్టర్స్ ని ఆదేశించిన సీఎస్.