Revanth Reddy: తెలంగాణలో జాతీయ రహదారుల ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రివ్యూ
Revanth Reddy: సమావేశంలో పాల్గొన్న మంత్రి కోమటిరెడ్డి, సీఎస్
Revanth Reddy: తెలంగాణలో చేపట్టబోతున్న జాతీయ రహదారుల ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఇతర అధికారులు పాల్గొన్నారు. నేషనల్ హైవేల నిర్మాణాల ప్రస్తుత స్టేటస్ పై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు సీఎం. రీజనల్ రింగ్ రోడ్డు, మంచిర్యాల-వరంగల్-ఖమ్మం-విజయవాడ కారిడార్ భూసేకరణలో పురోగతిపై ఆరా తీశారు. ఈ నెలాఖారులోగా పూర్తి వివరాలు, ప్రపోజల్స్ ను ఉన్నతాధికారులకు సమర్పించాలని కలెక్టర్లను ఆదేశించారు సీఎం రేవంత్.