Revanth Reddy: ACDS మన సైనికుల పిల్లలకు సేవలందించడం మన సైన్యానికి, దేశానికి గర్వకారణం
Revanth Reddy: స్నాతకోత్సవ వేడుకలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి
Revanth Reddy: సికింద్రాబాద్ ఆర్మీ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్స్ స్నాతకోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. ఆర్మీ డెంటర్ కాలేజ్ స్నాతకోత్సవానికి హాజరుకావడం సంతోషంగా ఉందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. మీ కృషి అంకితభావం ఇక్కడికి తీసుకొచ్చిందని డెంటల్ వైద్యులను రేవంత్‌రెడ్డి అభినందించారు. నేటి నుంచి కొత్త ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నారని అన్నారు. ఆర్మీ కాలేజ్ ఆఫ్ డెంటల్ మన సైనికుల పిల్లలకు సేవలందించడం సైన్యానికి, దేశానికి గర్వకారణమన్నారు.