వర్ష ప్రభావిత ప్రాంతాల్లో ఇవాళ సీఎం కేసీఆర్ పర్యటన
CM KCR: 10:15 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్ట్‌కు కేసీఆర్
KCR: అకాల వర్షంతో దెబ్బతిన్న పంటలను సీఎం కేసీఆర్ పరిశీలించబోతున్నారు. తెలంగాణలో పంటనష్టం తీవ్రత ఉన్న ఖమ్మం, మహబూబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో ఇవాళ పర్యటించబోతున్నారు. ఉన్నతస్థాయి అధికారులతో చర్చించిన తర్వాత షెడ్యూలు ఖరారు చేశారు.
సీఎం కేసీఆర్ ఇవాళ ఉదయం 10 గంటల 15 నిమిషాలకు ప్రగతి భవన్ నుంచి బేగంపేట్ ఎయిర్ పోర్ట్ చేరుకుంటారు. అక్కడినుంచి ఖమ్మం జిల్లా బోనకల్ మండలం రామాపురం చేరుకుని దెబ్బతిన్న పంటపొలాలను పరిశీలిస్తారు. పంటనష్టం వివరాలను తెలుసుకుని అక్కడే రైతులతో కాసేపు ముచ్చటిస్తారు. రైతుల సమక్షంలోనే అధికారులతో సమీక్షిస్తారు. దెబ్బతిన్న రైతుల్ని ఆదుకునేందకు సంబంధించి అధికారులకు ఆదేశాలు జారీ చేస్తారు.
అక్కడి నుంచి మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం రెడ్డిగుంట తండా చేరుకుంటారు. అక్కడ దెబ్బతిన్న పంటను పరిశీలిస్తారు. రైతులను పరామర్శించి... పంట నష్టపరిహారంపై భరోసా కల్పించనున్నారు. అక్కడి నుంచి వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం అడవి రంగాపురం చేరుకుంటారు. అక్కడ వడగండ్ల వానకు దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తారు. రైతులతో మాట్లాడి నష్టపోయిన పంట వివరాలను తెలుసుకుంటారు. అక్కడి నుంచి కరీంనగర్ జిల్లా రామడుగుమండలం లక్ష్మీపురం చేరుకుంటారు. వర్షాలకు దెబ్బతిన్న పంటను పరిశీలిస్తారు. రైతులతో ముచ్చటించి... పంటనష్ట పరిహారంతో ఆదుకునేందుకు.. వ్యవసాయ అధికారులకు ఆదేశాలు జారీచేస్తారు.