CM KCR: ఏసుక్రీస్తు బోధనలు ఆచరణీయం
CM KCR: ఏసుక్రీస్తు దీవెనలు అందరికి లభించాలి
CM KCR: క్రిస్మస్ సందర్భంగా క్రైస్తవులకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఏసుక్రీస్తు బోధనలు విశ్వమానవ సహోదరత్వానికి దోహదం చేశాయని పేర్కొన్నారు. ఏసు శాంతి, కరుణ, సహనం, ప్రేమ విలువలను ప్రపంచానికి చాటారన్నారు. ఒక వైపు శాస్త్ర, సాంకేతిక రంగాలు గొప్పగా పురోగమిస్తున్నా, మరోవైపు మానవీయ విలువలు మృగ్యమైపోతున్న నేటి కాలంలో.. క్రీస్తు బోధనలు ఆచరణీయమని తెలిపారు. శత్రువునైనా క్షమించే గొప్ప గుణం ఉండాలని క్రీస్తు బోధించారని, సాటి మనుషుల పట్ల ప్రేమ, కరుణ, సహనం అనే సద్గుణాల ఆచరణ అనివార్యమైందని సీఎం కేసీఆర్ అన్నారు. ఏసుక్రీస్తు దీవెనలు ప్రజలందరికీ లభించాలన్నారు సీఎం.