బీఆర్‌ఎస్‌గా మారిన టీఆర్ఎస్.. బీఆర్‌ఎస్ జెండాను ఆవిష్కరించిన సీఎం కేసీఆర్..
బీఆర్‌ఎస్‌గా మారిన టీఆర్ఎస్.. బీఆర్‌ఎస్ జెండాను ఆవిష్కరించిన సీఎం కేసీఆర్..
BRS Celebrations: భారత రాష్ట్ర సమితి జెండాను ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించారు. జెండా ఆవిష్కరణ కంటే ముందు బీఆర్ఎస్ పత్రాలపై కేసీఆర్ సంతకం చేశారు. అంతకు ముందు తెలంగాణ భవన్‌లో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేద పండితుల ఆశీర్వచనాలు అందుకున్నారు కేసీఆర్. ఆవిర్భావ వేడుకల్లో పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.