Br Ambedkar: 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం కేసీఆర్
Inauguration Of 125 Feet Ambedkar Statue: హైదరాబాద్‌లో మరో మహోన్నత ఘట్టం ఆవిష్కృతమైంది.
Inauguration Of 125 Feet Ambedkar Statue: హైదరాబాద్‌లో మరో మహోన్నత ఘట్టం ఆవిష్కృతమైంది. హుస్సేన్ సాగర తీరాన దేశంలోనే అతిపెద్ద అంబేడ్కర్ విగ్రహాన్ని అంబేడ్కర్ మనువడు ప్రకాశ్ అంబేడ్కర్‌తో కలిసి సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. కేసీఆర్, ప్రకాశ్ అంబేడ్కర్ విగ్రహం వద్దకు చేరుకోగానే బౌద్ధగురువులు స్వాగతం పలికారు. విగ్రహావిష్కర కార్యక్రమానికి బౌద్ధగురువులను తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా ఆహ్వానించింది.
125 అడుగుల అంబేడ్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని విక్షించేందుకు భారీగా ప్రజలు తరలివచ్చారు. రాష్ట్రం నుంచే కాకుండా దేశనలుమూలల నుంచి అంబేడ్కర్ అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరైయ్యారు. దీంతో సాగరతీరం జనసంద్రంగా మారింది. జై భీమ్ నినాదాలతో మారుమోగింది. అంబేడ్కర్ విగ్రహం... కేవలం విగ్రహానికి మాత్రమే పరిమితం కాకుండా.. విజ్ఞానాన్ని పంచాలని తెలంగాణ ప్రభుత్వం సంకల్పించింది. అందుకే విగ్రహానికి కింద ఉన్న భవనంలో మ్యూజియం, ఫొటో గ్యాలరీ, కాన్ఫరెన్స్ హాల్‌ను ఏర్పాటు చేశారు. మొత్తం ఈ నిర్మాణానికి 147 కోట్లును తెలంగాణ ప్రభుత్వం వెచ్చించింది.