BRS Manifesto: 15న 'కీ' మీటింగ్.. అదేరోజున పార్టీ ఎన్నికల మేనిఫెస్టో ప్రకటన..

BRS: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలవడంతో రాష్ట్రంలో ఎన్నికల హడావిడి మొదలైపోయింది.

Update: 2023-10-09 13:45 GMT

BRS Manifesto: 15న 'కీ' మీటింగ్.. అదేరోజున పార్టీ ఎన్నికల మేనిఫెస్టో ప్రకటన..

BRS: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలవడంతో రాష్ట్రంలో ఎన్నికల హడావిడి మొదలైపోయింది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ ఈ నెల 15న బీఆర్‌ఎస్‌ అభ్యర్థులతో సమావేశం కానున్నారు. తెలంగాణ భవన్‌లో జరిగే ఈ సమావేశంలో అభ్యర్థులకు బీ ఫారాలను అందజేయనున్నారు. ఇక అదేరోజున పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించనున్నారు. అదే రోజు నుంచి ఎన్నికల ప్రచారానికి కూడా శ్రీకారం చుట్టనున్నారు గులాబీ బాస్. 15న సాయంత్రం హైదరాబాద్‌ నుంచి బయలుదేరి.. హుస్నాబాద్‌ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. 16న జనగామ, భువనగిరి నియోజకవర్గ కేంద్రాల్లో జరిగే బహిరంగ సభలకు హాజరవుతారు. 17న సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గాల్లో జరిగే సభలకు హాజరవుతారు. 18న మధ్యాహ్నం 2 గంటలకు జడ్చర్ల నియోజకవర్గ కేంద్రంలో జరిగే మీటింగ్‌లో, సాయంత్రం 4 గంటలకు మేడ్చల్‌లో జరిగే సభకు హాజరై ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు.

నవంబర్‌ 9న గజ్వేల్‌, కామారెడ్డిలో కేసీఆర్‌ నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. నవంబర్‌ 9న సిద్దిపేట నియోజకవర్గంలోని కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోనున్నారు సీఎం కేసీఆర్‌. ఆనవాయితీ ప్రకారం ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. స్వామివారి దర్శనం అనంతరం గజ్వేల్‌లో మొదటి నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు కామారెడ్డిలో రెండో నామినేషన్‌ వేస్తారు సీఎం కేసీఆర్. అనంతరం కామారెడ్డిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో గులాబీ బాస్‌ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు.

Tags:    

Similar News