CM KCR: బీజేపీకి ఓటు పడితే.. మోటార్లకు మీటర్ పడినట్టే..
CM KCR Speech in Munugode: ప్రజాదీవెన సభలో సీఎం కేసీఆర్ గులాబీ జెండా ఎగుర వేశారు.
CM KCR Speech in Munugode: ప్రజాదీవెన సభలో సీఎం కేసీఆర్ గులాబీ జెండా ఎగుర వేశారు. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం ద్వారా భారీ కాన్వాయ్‌తో సీఎం కేసీఆర్ మునుగోడుకు చేరుకున్నారు. పెద్ద ఎత్తున గులాబీ శ్రేణులు సీఎం కేసీఆర్‌కు స్వాగతం పలుకగా అభివాదం చేస్తూ సభ వేదికకు చేరుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణతల్లి విగ్రహానికి పూలమాలవేశారు.
ఈ సందర్భంగా సభకు హాజరైన ప్రజలనుద్దేశించి మాట్లాడారు. మోదీ దోస్తులు సూట్‌కేసులు పట్టుకుని రెడీగా ఉన్నారు. కార్పొరేట్ వ్యవసాయం చేద్దామనే కుట్ర జరుగుతోంది. బీజేపీ పాలనలో ఒక్క మంచి పని అయినా జరిగిందా? రాష్ట్రపతి ఎన్నికలప్పుడు 20 ప్రశ్నలు అడిగాను, దేనికీ సమాధనం చెప్పలేదు. ఎయిర్‌పోర్టుల, విమానాలు, రైళ్లు, రోడ్లు అమ్ముతున్నారు. మిగిలింది ఇక రైతులు, రైతుల భూములు, పంటలు. మన నోట్లో మట్టి పోసే పని జరుగుతోంది. బావుల వద్ద మీటర్లు పెట్టాలని కేంద్రం అంటోంది. నేను చచ్చినా మీటర్లు పెట్టనని తెగేసి చెప్పిన. బీజేపీ లక్ష్యం ఎరువుల ధరలు పెంచాలి, కరెంట్ రేటు పెంచాలి, పండిన పంటకు ధర ఇవ్వకూడదు. మరి వ్యవసాయ భూములకు మీటర్లు పెట్టే బీజేపీ కావాలా? మీటర్లు వద్దన్న కేసీఆర్ కావాలా? మునుగోడు ప్రజలు నిర్ణయించుకోవాలి అని సీఎం కేసీఆర్ అన్నారు.