మరియమ్మ లాకప్‌డెత్‌పై సీఎం కేసీఆర్ సీరియస్.. అధికారులకు కీలక ఆదేశాలు

Mariyamma Lockup Death: దళిత మహిళ మరియమ్మ లాకప్ డెత్ ఘటనపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ సీరియస్‌ అయ్యారు‌.

Update: 2021-06-25 15:03 GMT

మరియమ్మ లాకప్‌డెత్‌పై సీఎం కేసీఆర్ సీరియస్.. అధికారులకు కీలక ఆదేశాలు

Mariyamma Lockup Death: దళిత మహిళ మరియమ్మ లాకప్ డెత్ ఘటనపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ సీరియస్‌ అయ్యారు‌. ఇటువంటి చర్యలను ప్రభుత్వం సహించబోదని హెచ్చరికలు జారీ చేశారు. బాధ్యులైన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే ఉద్యోగం నుంచి తొలగించాలని డీజీపీ మహేందర్‌రెడ్డిని ఆదేశించారు. పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసిన సీఎం కేసీఆర్ ఇలాంటి చర్యలకు పాల్పడటం అత్యంత బాధాకరమన్నారు. పోలీస్ శాఖలో ఇలాంటి చర్యలను ప్రభుత్వం క్షమించబోదన్నారు. దళితులపై చేయి పడితే ప్రభుత్వం ఊరుకోదని హెచ్చరించిన ముఖ‌్యమంత్రి కేసీఆర్ దళితులు, పేదలపై ప్రతాపం చూపిస్తే కఠిన చర్యలు ఉంటాయంటూ వార్నింగ్ ఇచ్చారు. దళితుల పట్ల సమాజం, పోలీసుల దృక్పథం మారాలని సూచించారు.

మరియమ్మ లాకప్ డెత్‌ అత్యంత బాధాకరమని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. మరియమ్మ కుటుంబాన్ని ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకుంటుందని తెలిపారు. మరియమ్మ కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగంతోపాటు 15లక్షల ఆర్ధిక సాయం, డబుల్ బెడ్రూమ్‌ ఇల్లు ఇస్తామన్నారు. అలాగే, మరియమ్మ ఇద్దరు కుమార్తెలకు చెరో 10లక్షల ఆర్ధిక సాయం అందించాలని సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌కు ఆదేశించారు. మరియమ్మ సొంతూరు చింతకానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించాలని డీజీపీ మహేందర్‌రెడ్డికి సూచించారు. అలాగే, ఈనెల 28న కాంగ్రెస్‌ ఎమ్మెల్యే భట్టితో కలిసి మరియమ్మ కుమారుడు, కుమార్తెలను పరామర్శించాలని మంత్రి పువ్వాడ, ఎంపీ నామా, కలెక్టర్, ఎస్పీకి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు.

Tags:    

Similar News