CM KCR: తెలంగాణ దళిత బంధు అమలు పై సీఎం కేసీఆర్ సమీక్షా సమావేశం

CM KCR: అధికారులకు పలు సూచనలు చేసిన సీఎం * తమ అభివృద్ధిని తామే నిర్వచించుకునే దిశగా చైతన్యమై,

Update: 2021-07-20 02:02 GMT
తెలంగాణ దళిత బందుపై సీఎం కెసిఆర్ సమీక్ష (ఫైల్ ఇమేజ్)

CM KCR: తెలంగాణలోని దళితుల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయబోతున్న తెలంగాణ దళిత బంధు పథకం అమలు విధి విధానాలు, రూపొందించాల్సిన ఉపాధి పథకాలపై ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. అనతి కాలంలోనే ఆర్ధిక స్వావలంబన కలిగించే వినూత్న ఉపాధి స్కీంలను తెలంగాణ దళిత బంధు పథకంలో భాగంగా రూపకల్పన చేసి లబ్ధిదారుల ముందుంచాలని సీఎం తెలిపారు. ఆ దిశగా చర్యలు చేపట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు. ముందు అధికారులు సెన్సిటైజ్ కావడం.. ఆ తర్వాత అర్హులైన లబ్ధిదారులను పథకం ఉపయోగించుకోవడంలో ఉద్దీపన కలిగించాలని సీఎం అధికారులకు తెలిపారు.

క్షేత్రస్థాయిలో పైలట్ ప్రాజెక్టు నియోజకవర్గ గ్రామాల్లో పర్యటించి దళిత కుటుంబాల స్థితిగతులను అర్ధం చేసుకోవాలని సీఎం కేసీఆర్ సూచించారు. వారి అభిప్రాయాలను కూడా సేకరించాలన్నారు. మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా వారికి అనువైన రీతిలో త్వరితగతిన ఆర్ధిక స్థిరత్వాన్ని కలిగించే పనులను గుర్తించి వాటిని పథకాలుగా మలచాలని ఆదేశించారు. ప్రభుత్వ యంత్రాంగం ఆదిశగా సెన్సిటైజ్ కావాలని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.

దళితుల అభ్యున్నతి కోసం పని చేస్తున్న అనుభవజ్ఞుల సలహాలను పాటించి వారి సూచనలను పథకంలో భాగంగా ఎలా అమలుపరచాలని సూచించారు. ఇందులో భాగంగా ఉన్నతాధికారులు ఉద్యోగుల దళితల ప్రముఖులు, దళిత సంఘాల నేతలు యాక్టివిస్టులతో కూడిన వర్క్ షాపు త్వరలో నిర్వహించనున్నట్టు సీఎం తెలిపారు. వర్క్‌షాపులో తీసుకున్న నిర్ణయాలను అనుసరించి పైలట్ ప్రాజెక్టు చేపడుతున్న నియోజకవర్గంలో దళిత వాడలకు వెళ్లాలని, అక్కడ దళిత కుటుంబాలతో మాట్లాడాలని, దళిత ప్రముఖులను కలవాలని వారి సూచనలతో స్కీంలను రూపొందించాలని సీఎం తెలిపారు.

ఒక దళిత కుటుంబానికి దళిత బంధు పథకం ద్వారా ఎలాంటి ఉపాధిని పొందుతారో తెలుసుకోవాలి. పాల ఉత్పత్తి కోసం బర్రెల పెంపకం, కిరాణం షాపు, ఆటోరిక్షాల నిర్వహణ, కుటీర పరిశ్రమలు తదితర ఉపాధి అవకాశాలను గుర్తించాలని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. వాటిని మార్కెట్ అనుసంధానం చేయడంలో ప్రభుత్వ యంత్రాంగం సహకరించాలన్నారు. 

Tags:    

Similar News