Karim Nagar: దళితబంధు పథకం అమలుపై సీఎం కేసీఆర్ సమీక్షా సమా‌వేశం

* సమావేశానికి మంత్రులు హరీశ్, గంగుల‌, కొప్పుల ఈశ్వర్‌ హాజరు * హుజూరాబాద్‌లోని 20,929 దళిత కుటుంబాలకు ఆర్థిక సాయం

Update: 2021-08-27 08:15 GMT

కెసిఆర్ (ఫైల్ ఫోటో)

CM KCR: సీఎం కేసీఆర్‌ కరీంనగర్‌ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా అలుగునూర్‌లో టీఆర్‌ఎస్‌ కార్మిక నేత రూప్‌సింగ్‌ కుమార్తె వివాహానికి సీఎం హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం దళితబంధు పథకం అమలుపై జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమా‌వేశం నిర్వహిస్తున్నారు. దళితబంధు పథకంలో భాగంగా హుజూరాబాద్‌లోని 20వేల,929 దళిత కుటుంబాలకు ఆర్థిక సాయం అందిచనున్నారు.

పైలెట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రారంభించిన ఈ పథకానికి నిధుల కేటాయింపు కూడా జరిగింది. దళితబంధు నిధులు 2 వేల కోట్లు ఇప్పటికే కలెక్టర్ ఖాతాలో ప్రభుత్వం జమచేసింది. ఈ సమావేశానికి మంత్రులు హరీశ్​రావు, గంగుల కమలాకర్‌, కొప్పుల ఈశ్వర్‌తో పాటు ఏడుగురు డిప్యూటీ కలెక్టర్లు హజరుకానున్నారు. సమావేశం అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు హెలీకాప్టర్‌ ద్వారా హైదరాబాద్‌కు తిరిగి వస్తారు.

Tags:    

Similar News