CM KCR Order to Puvvada: ఆ బస్సుల రంగును తొలగించండి.. సీఎం

Update: 2020-07-23 11:57 GMT
ప్రతీకాత్మక చిత్రం

Remove Pink Colour from TSRTC Women bio Toilets: మహిళలు బయటికి వెళ్లినడుపు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొకుండా ఉండేందుకు బయో టాయిలెట్స్‌ ఆన్ వీల్స్ బస్సులకు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ బస్సులను వేసిన రంగులపై ముఖ్యమంత్రి కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేసారనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ బస్సులను తెలంగాణ పార్టీ జెండాలో ఉండే గులాబి రంగులను వేయడంతో సీఎం కేసీఆర్ తప్పుబట్టారు. దీంతో గురువారం ఉదయం రవాణాశాఖ మంత్రి మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ కు సీఎం కేసీఆర్ ఫోన్ చేసి బస్సులపై వేసిన గులాబీ రంగును వెంటనే తొలగించాలని ఆదేశించారు.

ఈ బస్సులు మహిళల సౌకర్యం కోసం ప్రవేశపెట్టినవని సీఎం అన్నారు. బయటికి వెళ్లినపుడు మహిళలకు ఎలాంటి ఇబ్బంది కలుగవద్దనే ఉద్దేశంతో తీసుకొచ్చారన్నారు. ఈ ఆర్టీసీ ఉమెన్‌ బయో టాయిలెట్‌ బస్సులు గులాబీ రంగులో ఉండకుండా చూడాలని మంత్రిని కేసీఆర్ ఆదేశించారు. దీంతో మంత్రి పువ్వాడ బస్సులకు ఉన్న గులాబి రంగును ఆయా అధికారులకు ఆదేశాలు జారీచేసారు. మంత్రి కేటీఆర్ సూచన మేరకు ఈ బస్సులకు గులాబీ రంగు వేయించినట్టు మంత్రి బుధవారం ట్వీట్ చేశారు. తాజాగా దీన్ని మార్చాలని సీఎం కేసీఆర్ ఆదేశించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇక పోతే మంత్రి పువ్వాడకు గతంలోనూ ఇలాంటి అనుభవమే ఒకటి ఎదురైంది. గతేడాది కార్గొ బస్సులను ప్రారంభించడానికి ముందు బస్సులపై సీఎం కేసీఆర్ చిత్రపటాలను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వేయించారు. అప్పుడు కూడా సీఎం కేసీఆర్ బస్సులపై తన చిత్రాలు ఉండకూడదని తెలిపారు. దీనిపై ప్రతిపక్షాలు కూడా వ్యతిరేకంగా స్పందించడంతో బస్సులపై ఆ ఫోటోలను తొలగించారు.

Tags:    

Similar News