CM KCR: ప్రొఫెసర్‌ హరగోపాల్‌, ఇతరులపై దేశద్రోహం కేసు ఎత్తివేయండి.. డీజీపీకి సీఎం కేసీఆర్ ఆదేశాలు

CM KCR: సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పౌర హక్కుల నేత, ప్రొఫెసర్ హరగోపాల్‌ పై నమోదైన రాజద్రోహం కేసును ఎత్తివేయాలని నిర్ణయించారు.

Update: 2023-06-17 07:30 GMT

CM KCR: ప్రొఫెసర్‌ హరగోపాల్‌, ఇతరులపై దేశద్రోహం కేసు ఎత్తివేయండి.. డీజీపీకి సీఎం కేసీఆర్ ఆదేశాలు

CM KCR: సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పౌర హక్కుల నేత, ప్రొఫెసర్ హరగోపాల్‌ పై నమోదైన రాజద్రోహం కేసును ఎత్తివేయాలని నిర్ణయించారు. హరగోపాల్ తో పాటు మరికొందరిపై చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా) కింద నమోదైన కేసులను ఉపసంహరించాలని రాష్ట్ర డీజీపీని ఆదేశించారు. ఈ మేరకు సీఎంవో నుంచి తెలంగాణ పోలీసు శాఖకు ఆదేశాలు జారీ అయ్యాయి. హరగోపాల్ సహా 152 మందిపై పెట్టిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డీజీపీ అంజనీకుమార్‌ను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆదేశించినట్లు తెలుస్తోంది.

మావోయిస్టు కార్యకలాపాలకు సహకరిస్తున్నారన్న ఆరోపణలపై హరగోపాల్‌తో పాటు ఇతర ప్రజాసంఘాల నేతలపై ఉపా చట్టం కింద తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎలాంటి తప్పు చేయకపోయినా, ఆధారాలు లేకుండా ఉపా చట్టం కింద కేసు నమోదు చేయడం దారుణమని.. వెంటనే వారిపై నమోదు చేసిన కేసు ఎత్తివేయాలని రాజకీయపార్టీలు, ప్రజాసంఘాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. ఈ నేపథ్యంలో అన్ని అంశాలను పరిశీలించిన కేసీఆర్.. హరగోపాల్ సహా ఇతరులపై నమోదు చేసిన కేసుల ఎత్తివేతకు నిర్ణయం తీసుకున్నారు. 

Tags:    

Similar News