వామపక్ష పార్టీలతో సీఎం కేసీఆర్‌ సమావేశం.. లౌకికవాద శక్తులన్నీ ఒక్కటై...

KCR: బీజేపీ వ్యతిరేక శక్తులను కలుపుకుని పోయే దిశగా వామపక్ష పార్టీ నేతలతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమావేశం జరిగింది...

Update: 2022-01-09 03:33 GMT

వామపక్ష పార్టీలతో సీఎం కేసీఆర్‌ సమావేశం.. లౌకికవాద శక్తులన్నీ ఒక్కటై...

KCR: బీజేపీ వ్యతిరేక శక్తులను కలుపుకుని పోయే దిశగా వామపక్ష పార్టీ నేతలతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమావేశం జరిగింది. బీజేపీ ముక్త్‌ భారత్‌ కోసం.., లౌకికవాద శక్తులన్నీ ఒక్కటైదామని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అయితే భవిష్యత్‌ కార్యాచరణ కోసం భావసారూప్యత కల్గిన శక్తులతో, పార్టీలతో మరోసారి సమావేశం కానున్నారు. మొత్తానికి దేశ రాజకీయాల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలపై వామపక్ష పార్టీల అగ్రనేతలతో సుదీర్ఘ చర్చ జరిపారు.

కేంద్రంలోని బీజేపీ.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు వ్యతిరేకంగా పనిచేస్తోందని.., బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వమని, బీజేపీ విభజన రాజకీయాలు దేశ రాజనీతికే మచ్చనే తమ అభిప్రాయాలను సమావేశంలో నేతలు ప్రస్తావించారు. అంతేకాదు.. నూతన తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బాధ్యతతో సహకరించాల్సింది పోయి అడుగడుగునా అడ్డుపడటం ఫెడరల్‌ స్ఫూర్తికే విరుద్ధమని అభిప్రాయ పడ్డారు.

పంజాబ్‌ పర్యటనకు వెళ్లిన మోడీకి రైతు వ్యతిరేకత సెగ తగలడం, ఆయన వెనక్కు తిరిగి రావడం, ఆతర్వాత అది భద్రతాకారణాల లోపంగా మారడం సంబంధిత అంశాలపై వామపక్షాలు తమ అభిప్రాయాలను సీఎం కేసీఆర్‌ ముందు సూటిగా మాట్లాడినట్లు సమాచారం. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల నగారా మోగిన సందర్భంగా జాతీయ రాజకీయాలపై వారు కేసీఆర్‌తో చర్చించినట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News