CM KCR: నేటి నుంచి రెండ్రోజుల పాటు మహారాష్ట్రలో సీఎం కేసీఆర్ పర్యటన
CM KCR: భారీ కాన్వాయ్‌తో మహారాష్ట్ర వెళ్లనున్న కేసీఆర్
CM KCR: సీఎం కేసీఆర్ ఇవాళ మహారాష్ట్రలో పర్యటించనున్నారు. పలువురు మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు కూడా ఈ పర్యటనకు వెళ్లనున్నారు. మహారాష్ట్రలోని షోలాపూర్‌లో బీఆర్‌ఎస్ కార్యక్రమాల్లో పాల్గొంటారు. రెండోరోజు పండరీపూర్, తుల్జాపూర్ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. సాయంత్రం షోలాపూర్ చేరుకుని అక్కడే బస చేస్తారు. ఈ సందర్భంగా తెలంగాణ నుంచి వలస వెళ్లిన చేనేత కార్మికుల కుటుంబాలు సీఎం కేసీఆర్‌ను కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో షోలాపూర్ జిల్లాకు చెందిన భగీరథ్ బాల్కేతోపాటు వివిధ పార్టీలకు చెందిన పలువురు నేతలు కేసీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరనున్నట్లు సమాచారం. షోలాపూర్‌లో రాత్రి బస చేసి.. మంగళవారం ఉదయం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి సీఎం కేసీఆర్ రోడ్డు మార్గంలోనే పండరీపూర్‌కు చేరుకొని అక్కడి విఠోభారుక్మిణి మందిర్‌లో ప్రత్యేక పూజలు చేస్తారు. ఆ తర్వాత దారాశివ్ జిల్లాలోని శక్తిపీఠమైన తుల్జాభవానీ అమ్మవారిని దర్శించుకొని పూజలు నిర్వహిస్తారు.