CM KCR: వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంగ్లీష్ మీడియంలో బోధన...
Mana Ooru Mana Badi: తెలంగాణ రాష్ట్రాన్ని కష్టపడి తెచ్చుకున్నాం కాబట్టి.. ఇష్టపడి పని చేసి అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని అన్నారు సీఎం కేసీఆర్.
Mana Ooru Mana Badi: తెలంగాణ రాష్ట్రాన్ని కష్టపడి తెచ్చుకున్నాం కాబట్టి.. ఇష్టపడి పని చేసి అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని అన్నారు సీఎం కేసీఆర్. వనపర్తి జిల్లా వేదికగా మన ఊరు – మన బడి కార్యక్రమానికి సీఎం శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మన ఊరు – మన బడి పైలాన్‌ను సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు.అనేక రంగాల్లో ముందున్నామన్న సీఎం.. 24 గంటలు కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మరోసారి స్పష్టం చేశారు. వైద్యరంగంలోనూ దూసుకెళ్తున్నామని, విద్యుత్, నీటి కొరత లేకుండా అభివృద్ధి చేసుకుంటున్నామన్నారు సీఎం కేసీఆర్.
'మన ఊరు- మన బడి' కార్యక్రమాన్ని వనపర్తి నుంచి ప్రారంభించడం ఈ జిల్లాకు దక్కిన గౌరవమన్నారు. తామంతా ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివి పైకి వచ్చామని చెప్పారు. ఈరోజు మీముందు ఇలా నిలచున్నామంటే ప్రభుత్వ పాఠశాలల్లో తమ గురువులు చెప్పిన విద్యే కారణమన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్య అందించాలనేది తమ లక్ష్యమని తెలిపారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఆంగ్ల బోధన కూడా ప్రారంభం కాబోతుందన్నారు. విద్యార్థులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మీ భవిష్యత్‌ను ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని కోరుకుంటున్నాను అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.